పొరపాట్లకు తావీయొద్దు
ఇబ్రహీంపట్నం: పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని.. ఏ ఒక్క పొరపాటుకు అవకాశమివ్వొద్దని కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎన్నికల పరిశీల కుడు మయాంక్ మిట్టల్ సూచించారు. శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందు కళాశాలలో ఎన్నికల నిర్వహణ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ నిష్పక్షపాతంగా విధులను నిర్వర్తించాలన్నారు. ఏ చిన్న తప్పిదం జరగకుండా ఆర్వోలు ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ఓటు వేసే అవకాశం కల్పించామ న్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయి వెంటనే కట్టుదిట్ట మైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించాలన్నారు. ఏమైనా లోపాలుంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాల న్నారు. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బందో బస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శేరిగూడలోని పోలింగ్ కేంద్రాలను, ఇందు కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంత రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, ఏసీపీ కేపీవీ రాజు తదితరులు పాల్గొన్నారు.


