ప్రజల చూపు బీఆర్‌ఎస్‌ వైపు | - | Sakshi
Sakshi News home page

ప్రజల చూపు బీఆర్‌ఎస్‌ వైపు

Feb 10 2026 9:47 AM | Updated on Feb 10 2026 9:47 AM

ప్రజల చూపు బీఆర్‌ఎస్‌ వైపు

ప్రజల చూపు బీఆర్‌ఎస్‌ వైపు

● మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి

చేవెళ్ల: రాష్ట్రంలో ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్‌ పాలన కోరుకుంటున్నారని, తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి జోస్యం చెప్పారు. మున్సిపల్‌ పరిధిలో 3, 5, 6, 7 వార్డుల్లో సోమవారం కౌన్సిలర్‌ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిందని, ఇచ్చిన హమీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాగా మున్సిపల్‌ పరిధిలోని ఆయా వార్డుల్లో రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి పి.కార్తీక్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement