పక్కాగా మున్సిపల్ ఎన్నికలు
చేవెళ్ల: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకుఅన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. చేవెళ్లలోని ఫరా కళాశాలలో సోమవారం పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్‌రూమ్, కౌంటింగ్ కేంద్రాలను డిప్యూటీ సీఈఓ రంగారావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశంతో కలిసి పరిశీలించారు. అన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది సమాయానికి ఆయా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలని చెప్పారు.
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
శంకర్‌పల్లి: మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. మున్సిపాలిటీలో ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలను సోమవారం ఆయన పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రం వద్ద ఇతరులెవరూ లోపలికి ప్రవేశించకుండా పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి ముందే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ యోగేశ్, తహసీల్దార్ సురేందర్, మున్సిపల్ మేనేజర్ అంజన్‌కుమార్, ఆర్‌ఐ తేజ తదితరులు పాల్గొన్నారు.


