బీఆర్‌ఎస్‌కు ఆదరణ
మాజీ మంత్రి, మహేశ్వరం
ఎమ్మెల్యే సబితారెడ్డి
చేవెళ్ల: ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్, కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని దామరగిద్ద 9,10, చేవెళ్లలోని 12,14,15,16, 17, 18 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి రెండేళ్లలో ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని గుర్తించాలన్నారు. ప్రజల్లో బీఆర్‌ఎస్‌కి మంచి ఆదరణ, అభిమానం కనిపిస్తున్నాయని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, ప్రభాకర్, పార్టీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.


