సమ్మెను జయప్రదం చేయాలి
హుడాకాంప్లెక్స్: దేశవ్యాప్తంగా ఈనెల 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు పిలుపునిచ్చారు. పార్టీ సరూర్‌నగర్ మండల కార్యాలయంలో శనివారం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలుతో కార్పొరేట్ సంస్థల సులభతర వ్యాపారానికి ద్వారాలు తెరిచిందని, వారి ప్రయోజనాలు పెంచేందుకే అమలుకు నోటిఫికేషన్ జారీ చేసిందని ఆరోపించారు. దీన్ని పూర్తిగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తోందని అన్నారు. నాలుగు లేబర్ కోడ్‌ను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025, వీబీజీ రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్‌ఐసీలో వందశాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేవారు. కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు చెప్పారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు జిల్లాల కృష్ణ, గ్యార క్రాంతి, రమావత్ సక్రు నాయక్, ఎండీ మహబూబ్, మండల కార్యదర్శి బాతరాజు నరసింహ, ఏఐఎస్‌ఎఫ్ మండల కార్యదర్శి పి.వినోద్ తదితరులు పాల్గొన్నారు.


