అభివృద్ధి పట్టని పార్టీలకు బుద్ధి చెప్పండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పట్టని పార్టీలకు బుద్ధి చెప్పండి

Feb 8 2026 7:55 AM | Updated on Feb 8 2026 7:55 AM

అభివృద్ధి పట్టని పార్టీలకు బుద్ధి చెప్పండి

అభివృద్ధి పట్టని పార్టీలకు బుద్ధి చెప్పండి

ఆమనగల్లు: మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోని బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని నాగర్‌కర్నూల్‌ ఎంపీ డా.మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్‌ పధిలోని వివిధ వార్డులకు పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున శనివారం వారు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాకే ఆమనగల్లు మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అన్నారు. రాబోయే రోజుల్లో రూ.100 కోట్లతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి అయిల శ్రీనివాస్‌గౌడ్‌, హైదరాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి, పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి, జెఈడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్‌, పార్టీ మండల అధ్యక్షుడు డోకురు ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement