మాణికేశ్వరీ మాత ఆలయంలో చోరీ
శంకర్‌పల్లి: మండల పరిధిలోని కొత్తపల్లి మాణికేశ్వరీ మాత ఆలయంలో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగింది. శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన ప్రకారం.. రోజుమాదిరిగానే ఆలయ పూజారి రాత్రి 10 గంటలకు గుడికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం 7 గంటలకు వచ్చి చూడగా.. తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి పరిశీలించగా.. హుండీలోని నగదు, నాలుగు పెద్ద దీపాలు చోరీ అయినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
పశు శిబిరాలను వినియోగించుకోవాలి
మొయినాబాద్‌రూరల్: ఉచిత పశుగర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ సీహెచ్ మల్లేశ్వరి అన్నారు. మండలంలోని అప్పారెడ్డిగూడలో శనివారం నిర్వహించిన శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పశువైద్య అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాస్‌రావు, సంస్థ డిప్యూటీ డైరెక్టర్ శ్రావణ్‌కుమార్, పశువైద్య అధికారులు వెంకట్‌యాదవ్, అరుణ్‌శ్రీ, శ్రావణ్‌కుమార్, దేవిరెడ్డి, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
పశువైద్యాధికారులు
అందుబాటులో ఉండాలి
షాబాద్: పశువైద్యాధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ డి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పశువైద్యశాలను శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. పాడి పరిశ్రమ అభివృద్ధికి దోహద పడేమేలు రకపు పశుగ్రాసాల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో షాబాద్ పశువైద్యాధికారి డాక్టర్ స్రవంతి, సిబ్బంది ఉన్నారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
దాయాదుల దాడికి
భయపడేనని ఫిర్యాదు
ధారూరు: దాయాదుల దాడికి భయపడి ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్పహ కోల్పోయిన ఆమెను కుటుంబ సభ్యులు వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటన మండల పరిధిలోని శేరిగడ్డతండాలో శుక్రవారం చోటుచేసుకోగా శనివారం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తండాకు చెందిన లోక్యానాయక్, పాండునాయక్ దాయాదులు. వీరి మధ్య ఇంటి స్థలం, వ్యవసాయ పొలాలకు సంబంధించిన గొడవలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న తన భార్య రేణుకపై దాయాది పాండునాయతో పాటు అతని తల్లి రుక్కిబాయి, భార్య బుజ్జిబాయి, చెల్లెలు బుజ్జిబాయి కలిసి దాచేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మూకుమ్మడి దాడితో హడలిపోయిన తన భార్య తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగిందని ఫిర్యాదు ఇచ్చారు.
మాణికేశ్వరీ మాత ఆలయంలో చోరీ
మాణికేశ్వరీ మాత ఆలయంలో చోరీ


