ఆలోచించి హస్తం గుర్తుకు ఓటేయండి | - | Sakshi
Sakshi News home page

ఆలోచించి హస్తం గుర్తుకు ఓటేయండి

Feb 10 2026 9:48 AM | Updated on Feb 10 2026 9:48 AM

ఆలోచించి హస్తం గుర్తుకు ఓటేయండి

ఆలోచించి హస్తం గుర్తుకు ఓటేయండి

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి మున్సిపల్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఓటర్లను కోరారు. పదేళ్ల దోపిడి పాలనకా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో చేస్తున్న నిర్లక్ష్యానికా.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. సోమవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి, ఆమనగల్లు పట్టణంలోని వివిధ వార్డుల్లో టాస్క్‌ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్‌, కార్పొరేటర్‌ విజయారెడ్డిలతో కలిసి మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం చేపట్టారు. గాంధీచౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి అంటే ఎంటో ఆమనగల్లు మున్సిపాలిటీలో చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నర్సింహ, కేశవులు, జగన్‌, ప్రభాకర్‌రెడ్డి, బిచ్చానాయక్‌, మండ్లి రాములు, విజయ్‌, అనంతరెడ్డి, నారాయణ, కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయ, రాజేశ్వరి, కృష్ణయాదవ్‌, ఒగ్గు మహేశ్‌, కృష్ణనాయక్‌, మానయ్య, అనిత, అంజలి, శారద, మల్లయ్య, రేవతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement