బీజేపీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి
చేవెళ్ల: బీజేపీ అభ్యర్థులకు ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధిచేసి చూపిస్తారని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో అభ్యర్థి కె.మహేందర్, దేవునిఎర్రవల్లి 3 వార్డులో పత్తి మీనాక్షి సత్యనారాయణ తరఫున శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీతోనే దేశం, రాష్ట్రం, గ్రామా లు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ప్రజల్లో బీజేపీకి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. చేవెళ్ల పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లో పార్టీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం,డాక్టర్‌మల్గారి వైభవ్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, జయశంకర్, కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


