ఒగ్గు కథ కళాకారిణి మృతి
యాచారం: ప్రముఖ ఒగ్గు కథ కళాకారిణి జమ్మ మల్లారి(85) శనివారం మృతి చెందారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లికి చెందిన ఆమె ఒగ్గు కథలపై మక్కువ పెంచుకుంది. ఆమె ఉమ్మడి రాష్ట్రంలో గొల్ల, కురుమల కుటుంబాల్లో శుభాకార్యాలు నిర్వహించేవారు.
తల్లీకుమారుడు అదృశ్యం
కడ్తాల్: మహిళ అదృశ్యమైన ఘటన మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. సీఐ గంగాధర్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎర్రోళ్ల సరస్వతి బాలరాజు దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి రెండేళ్ల కుమారుడు శ్రీచరణ్ ఉన్నాడు. నెల రోజుల క్రితం సరస్వతి తన కుమారుడిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆందోళనకు గురైన బాలరాజు సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికాడు. ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా బాలరాజు మొదటి భార్య చనిపోయిన తర్వాత సరస్వతిని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ముగ్గురు కుమారులు సంతానం.
రాజేంద్రనగర్: పోక్సో కేసులో తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని రాజేంద్రనగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ ముత్తు యాదవ్ ప్రకారం.. సన్‌సిటీ ప్రాంతానికి చెందిన మహ్మద్ షాహీద్ (48) 2023లో మైనర్ బాలికపై అఘాత్యానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఒగ్గు కథ కళాకారిణి మృతి


