బైక్‌ దొంగ రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

బైక్‌ దొంగ రిమాండ్‌

Feb 6 2026 11:43 AM | Updated on Feb 6 2026 11:43 AM

బైక్‌ దొంగ రిమాండ్‌

బైక్‌ దొంగ రిమాండ్‌

ఐదు ద్విచక్ర వాహనాలను

స్వాధీనం చేసుకున్న పోలీసులు

షాద్‌నగర్‌రూరల్‌: తాళం వేసి పార్కు చేసిన బైక్‌లను దొంగతనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. గురువారం షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో డీసీపీ శిరీష వివరాలను వెల్లడించారు. ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్ట గ్రామపంచాయితీ పరిధిలోని మహాల్‌ ఎలికట్ట గ్రామానికి చెందిన జక్కుల శివలింగం బైక్‌ దొంగతనాలను పాల్పడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇంటి ముందు, షాపుల వద్ద తాళం వేసి పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోతాడు. పట్టణానికి చెందిన నడికూడ రాఘవేందర్‌యాదవ్‌ ఈ నెల 3న పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డులో గల త్రిశూల్‌ వైన్స్‌ షాపు ముందు తన బైక్‌ను పార్కింగ్‌ చేసి వెళ్లినాడు. తిరిగి వచ్చి చూడగా బైక్‌ కనిపించలేదు. దీంతో ఈ నెల 4న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించిన పోలీసులు శివలింగం నుంచి ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితుడు 30 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్ల్లు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులను డీసీపీ శిరీష అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయ్‌కుమార్‌, డీఐ వెంకటేశ్వర్లు, క్రైం డీఎస్‌ఐ శివారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement