ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు
హుడాకాంప్లెక్స్: జిల్లా స్థాయి సీఎం కప్–2025–26 క్రీడా పోటీలు సోమవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. అథ్లెటిక్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఖోఖో విభాగాల్లో పోటీలు జరిగాయి. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖో–ఖో బాలుర విభాగంలో ఎల్బీ నగర్ జట్టు విజేతగా, ఇబ్రహీంపట్నం జట్టు రన్నర్‌గా నిలిచింది. బాలికల విభాగంలో ఇబ్రహీంపట్నం జట్టు విజేతగా, ఎల్బీనగర్ జట్టు రన్నర్‌గా నిలిచింది. బాస్కెట్ బాల్ పోటీల్లో ఎల్బీనగర్ జట్టు విజేతగా నిలిచింది. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు, జట్లు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. విజేతలకు జిల్లా ఒలింపిక్ అధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా క్రీడల విభాగం అధికారి వెంకటేశ్వర్‌రావు, అసోసియేషన్ కార్యదర్శులు రవికుమార్, రాఘవరెడ్డి, రామచంద్రుడు, షబ్సీర్ సహా పలువురు కోచ్‌లు, ఫిజికల్ డైరెక్టర్లు పతకాలు, మెరిట్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.


