మైసిగండి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తులు | - | Sakshi
Sakshi News home page

మైసిగండి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తులు

Feb 9 2026 8:51 AM | Updated on Feb 9 2026 8:51 AM

మైసిగండి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తులు

మైసిగండి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తులు

మైసిగండి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తులు కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలి బీఆర్‌ఎస్‌ పదేళ్లలో చేసిందేమిటో చెప్పాలి ప్రజాప్రభుత్వానికి అండగా ఉండండి

కడ్తాల్‌: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ స్నేహలత, మాజీ సర్పంచ్‌ లక్ష్మీనర్సింహరెడ్డి, ప్రధాన అర్చకుడు యాదగిరిస్వామి ఉన్నారు.

హయత్‌నగర్‌: కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి డిమాండ్‌ చేశారు. ఈనెల 12న నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం పెద్దఅంబర్‌పేట్‌ డివిజన్‌ కుంట్లూర్‌ రావినారాయణరెడ్డి కాలనీలో సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కార్మిక వ్యతిరేక విదానాలను అవలంబిస్తోందని, ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కార్మిక సంఘా లు చేస్తున్న సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు అధికంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆజ్మీరా హరిసింగ్‌ నాయక్‌, సీపీఐ రాష్ట్ర కౌన్సి ల్‌ సభ్యుడు మత్యాల యాదిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బతి లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

మొయినాబాద్‌: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఫయిముద్దీన్‌ ప్రశ్నించారు. మొయినాబాద్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ఓటు అడిగే హక్కులేదన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 1.85 లక్షల రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. రెండు సార్లు ఎంపీగా ఉన్న విశ్వేశ్వరరెడ్డి ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్‌, టీపీసీసీ సభ్యుడు షాబాద్‌ దర్శన్‌, పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు అజీజ్‌నగర్‌, ఎనికేపల్లి, మొయినాబాద్‌లో మండలి చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహాడ్డి, మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి తదితరులు అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు.

అనంతగిరి: కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటేసి ప్రజాప్రభుత్వానికి అండగా ఉండాలని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ కోరారు. ఆదివారం ఆయన వికారాబాద్‌లోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం, రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనంతగిరిని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తానన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్‌, ఉచిత బస్సు ప్రయా ణం, వడ్డీలేని రుణాలు అందించి సంక్షేమ పాలన అందిస్తున్నామని వివరించారు. మున్సిపల్‌ బరిలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement