కిలో వెండి, నాలుగు తులాల బంగారం, రూ.15 వేల నగదు అపహరణ | - | Sakshi
Sakshi News home page

కిలో వెండి, నాలుగు తులాల బంగారం, రూ.15 వేల నగదు అపహరణ

Feb 8 2026 7:55 AM | Updated on Feb 8 2026 7:55 AM

కిలో వెండి, నాలుగు తులాల బంగారం, రూ.15 వేల నగదు అపహరణ

కిలో వెండి, నాలుగు తులాల బంగారం, రూ.15 వేల నగదు అపహరణ

తాళం వేసిన ఇంటికి కన్నం

శంకర్‌పల్లి: తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన శంకర్‌పల్లి ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని భవానీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌, అరుంధతి దంపతులు శుక్రవారం మధ్యాహ్నం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లారు. ఈ సమయంలో పక్కింటి వారికి ఇంటిని పరిశీలిస్తుండండని చెప్పి వెళ్లారు. శనివారం ఉదయం 7గంటలకు పక్కింటి వారికి ఫోన్‌ చేసి ఇంటిని పరిశీలించండి అని చెప్పగా వారు తాళం పగులగొట్టి ఉందని చెప్పారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించి బీరువా ధ్వంసం చేసి ఉందన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా క్లూస్‌టీం వివరాలు సేకరించింది. కిలో వెండి, నాలుగు తులాల బంగారం, రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారని బాధితురాలు అరుంధతి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement