హక్కులు కల్పించండి
యాచారం: నందివనపర్తి ఓంకారేశ్వరాలయ భూములపై హక్కులు కల్పించి పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయాలని కౌలు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో కౌలు రైతులు యాచారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఓంకారేశ్వరాలయ భూములను టీజీఐఐసీకి తీసుకోవడాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా సాగులో ఉన్నాం.. 37 ఏ సర్టిఫికెట్లు సైతం ఉన్నాయని కౌలు రైతులు తెలిపారు. 38ఈ సర్టిఫికెట్లు ఇచ్చి పట్టాదారు, పాసుపుస్తకాలు ఇవ్వకుండా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని యాచారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య, నస్దిక్‌సింగారం సర్పంచ్ బోడ కృష్ణ, కౌలు రైతులు పాల్గొన్నారు.
● ఓంకారేశ్వరాలయ భూములకు పాసుపుస్తకాలు ఇవ్వాలి
● తహసీల్దార్ కార్యాలయం ఎదుట కౌలు రైతుల ధర్నా


