బరిలో భార్యాభర్తలు | - | Sakshi
Sakshi News home page

బరిలో భార్యాభర్తలు

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

బరిలో భార్యాభర్తలు

బరిలో భార్యాభర్తలు

షాద్‌నగర్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో భార్యాభర్తలు ఒకే పార్టీ నుంచి వేర్వేరు వార్డుల్లో పోటీ చేస్తున్నారు. పట్టణంలోని 28వ వార్డు గాంధీనగర్‌ కాలనీ బీసీ మహిళకు రిజర్వు అయింది. దీంతో ఆ వార్డులో చేగూరి లక్ష్మీ ప్రసన్న, 9వ వార్డు బీసీ జనరల్‌కు కేటాయించగా.. ఆమె భర్త వేణుగోపాల్‌ బరిలో నిలిచారు. దంపతులు బీఆర్‌ఎస్‌ పార్టీ బీ ఫాంలు దక్కించుకొని ఎన్నికల ప్రచారంలో ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

ఒక్క ఎంట్రీతో

ఓటర్ల వివరాలు

షాద్‌నగర్‌: బస్సు ఎక్కినప్పుడు కండక్టర్‌ టికెట్లు ఇచ్చే మిషన్‌ చూశారా.. కరెంటు బిల్లు చేతికి ఇచ్చేటప్పుడు విద్యుత్‌ సిబ్బంది చేతిలో మిషన్‌ చూశారా.. అలాంటి ఒక చిన్న మిషన్‌ ఇప్పుడు ఎన్నికల వేళ అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేకంగా ఒక యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని ఓటరు మొబైల్‌ నంబర్‌ను అందులో ఎంట్రీ చేస్తే చాలు మన కుటుంబంలో ఓట్ల వివరాలు.. ఏ పోలింగ్‌ స్టేషన్‌లో మన ఓట్లు ఉన్నాయనే వివరాలు సమస్తం తెలుస్తాయి. ఫోన్‌ ద్వారా చిన్న యంత్రం సహాయంతో అప్పటికప్పుడే అభ్యర్థులు ఓటర్లకు పోల్‌ చిట్టీ లాంటి పేపర్‌ను ప్రింటింగ్‌ చేసి ఇస్తున్నారు. ఇది చూసి జనం దీన్ని మిషన్‌ పురపాలికగా అభివర్ణిస్తున్నారు. ఈ యంత్రాలు షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో విరివిగా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement