ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయండి
షాద్‌నగర్‌రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీసీపీ శిరీష అన్నారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో గురువారం పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతిభధ్రతలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. ప్రజలు భయాందోళన చెందకుండా, ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐలు విజయ్‌కుమార్, నర్సయ్య, శ్రీనివాస్, నరహరి, డీఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు సుశీల, రాంచందర్, శ్రీకాంత్, ప్రణయ్ పాల్గొన్నారు.


