దంగల్
న్యూస్‌రీల్
తప్పని రెబల్స్ బెడద
ఉపసంహరణ తర్వాత..
బుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మున్సిపల్..
పుర బరిలో ‘కీ’లక సమరం మొదలుకానుంది.. నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియకు మంగళవారంతో తెరపడింది.. బీఫారాల లొల్లి ముగిసిపోయింది.. అన్ని పార్టీల్లోనూ రె‘బెల్స్’ మోగిస్తున్నారు.. పోటీలో మిగిలిందెవరో తేలిపోయింది.. ఇక అసలు యుద్ధానికి అభ్యర్థులు రె‘ఢీ’ అంటున్నారు.. ప్రచారంపై ఫోకస్ పెట్టారు..
● ఆలోచించి ఓటు వేయండి
● మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ తీరు తెన్నులను నిశితంగా పరిశీలించాలని మైక్రో అబ్జర్వర్లకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా చూడాలని మంగళవారం కలెక్టరేట్‌లో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్‌కు ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకొని పోలింగ్ సిబ్బందికి అందించే సామగ్రి సక్రమంగా అందిందా లేదా చూసుకోవాలని తెలిపారు. పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్‌స్టేషన్‌కు చేరుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా మాక్‌పోల్, అనంతరం పోలింగ్ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా జరుగుతుందా లేదా పరిశీలన చేయాలని సూచించారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, విద్యాధికారి సుశీందర్‌రావు, మాస్టర్ ట్రైనర్లు, మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
మహారాష్ట్ర ఐటీ మంత్రి అశిష్ షెలర్
చేవెళ్ల: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని మహారాష్ట్ర ఐటీశాఖ మంత్రి అశిష్ షెలర్ పిలుపునిచ్చారు. చేవెళ్లలో మంగళవారం పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు, నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు బూత్‌స్థాయి నుంచి పార్టీ క్యాడర్ బలంగా పనిచేయాలని సూచించారు. దేశంకోసం, పేదలకోసం బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిసేలా వివరించాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్‌రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి
షాద్‌నగర్‌రూరల్: బీజేపీ పాలమూరులోని ఏవీఎస్ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించనున్న విజయ సంకల్పసభను విజయవంతం చేద్దామని పార్టీ రాష్ట్ర నాయకుడు, మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణానికి చెందిన పార్టీ నాయకుడు మణికొండ రంగయ్యగౌడ్ స్వగృహంలో ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రకాశ్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న నితిన్‌నబీ పాలమూరులో నిర్వహించే విజయ సంకల్పసభలో పాల్గొంటారన్నారు. తెలంగాణ రాజకీయాలకు కొత్త దిశ, ఊపిరివచ్చే సంకల్పం పాలమూరు సభ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఈ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి పాలమూరు గడ్డపై పార్టీ సత్తాచాటాలని కోరారు. సమావేశంలో నాయకులు శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, చెంది మహేందర్‌రెడ్డి, డాక్టర్ విజయకుమార్, కక్కునూరి వెంకటేశ్‌గుప్తా, దేపల్లి అశోక్‌గౌడ్, నర్సింహ, కుర్మయ్య, లక్ష్మికాంత్‌రెడ్డి, సురేశ్, రాజు, అరవింద్, హరిభూషణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలోని 126 వార్డులో ఎన్నికలు జరుగుతుండగా, వీటిలో అధికార కాంగ్రెస్ నుంచి 126 మంది బరిలో నిలిచారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నుంచి 122 మంది, బీజేపీ నుంచి 109 మంది పోటీలో ఉన్నారు. జనసేన నుంచి తొమ్మిది మంది, బీఎస్పీ నుంచి ముగ్గురు, సీపీఎం, సీపీఐ నుంచి ఇద్దరు చొప్పున, ఎంఐఎం నుంచి ఒకరు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఇద్దరు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి నలుగురు సహా మరో 57 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. బుధవారం నుంచే వీరంతా ముఖ్య నేతలతో కలిసి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి.
ఏళ్లుగా పార్టీని నమ్ముకుని, సంక్షోభ సమయంలోనూ పార్టీ అభివృద్ధి కోసం పాటు పడినప్పటికీ బీ ఫారాలు దక్కని ఆశావహులు అధినేతలపై తిరుగుబావుటా ఎగరేశారు. కొంతమంది ఏకంగా పార్టీ మారగా, మరికొంత మంది ఏకంగా స్వపక్షంలోనే విపక్షంలా తయారయ్యారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఐదో వార్డుకు చెందిన అల్లం శ్రీనివాసరెడ్డి బీ ఫారం దక్కలేదనే కారణంతో అధికార కాంగ్రెస్‌ను వీడి, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇబ్రహీంపట్నం ఆరో వార్డుకు చెందిన జెలమోని రవీందర్ కాంగ్రెస్‌ను వీడారు. అదే వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
పార్టీల వారీగా ఇదీ లెక్క..
మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులు
ఆమనగల్లు 15 15 15 15 09
చేవెళ్ల 18 18 18 18 05
ఇబ్రహీంపట్నం 24 24 23 20 16
మొయినాబాద్ 26 26 26 23 17
షాద్‌నగర్ 28 28 28 19 17
శంకర్‌పల్లి 15 15 12 14 16
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అగ్ని ప్రమాదాల నివారణకు హైడ్రా అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. నాంపల్లిలోని ఫర్నిచర్ షోరూంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంతో పాటు ఇతర ఘటనల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి చర్యలు తీసుకుంది. నిబంధనలు తప్పనిసరిగా పాటించేందుకు నెల రోజులు గడువు ఇస్తూనే అవగాహన చేపట్టింది. మంగళవారం పలు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.
విలేకరులతో మాట్లాడుతున్న చైర్మన్ మధుసూదన్‌రెడ్డి
ఉద్యోగుల వాగ్వాదం
చేవెళ్ల మూడో వార్డులో బీఆర్‌ఎస్ పార్టీకి, ఆరో వార్డులో కాంగ్రెస్ పార్టీకి రెబల్ బెడద తప్పలేదు. బీఆర్‌ఎస్ బీ ఫాంపై ఆ పార్టీకి చెందిన నాగమణి నామినేషన్ దాఖలు చేయగా, ఇదే పార్టీకి చెందిన లక్ష్మి ఇదే వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ బీ ఫాం నుంచి సుచిత పోటీ చేయగా, అదే పార్టీకి చెందిన సంధ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు.
ఆమనగల్లు మున్సి పాలిటీ 15వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా సీతమ్మ బరిలోకి దిగగా, ఆమెకు పోటీగా అదే పార్టీకి చెందిన ఝాన్సీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఇబ్రహీపట్నం మున్సిపాలి టీలో కాంగ్రెస్ పార్టీకి స్వపక్షంలో విపక్ష బెడద తప్పలేదు. ఒకటి, మూడు, ఆరు, 14వ వార్డుల్లో రెబల్స్ పోటీ తప్పలేదు. బీ ఫారం దక్కక పోవడంతో ఇప్పటికే కొంత మంది పార్టీని వీడటం, మరికొంత మంది ఇదే బాటలో ప్రయాణిస్తుండటం అధికార పార్టీకి మింగుడుపడడం లేదు.
శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఏడో వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు పోటీ చేశారు. బీ ఫారంపై బండ్లగూడెం శ్రీను బరిలో నిలవగా, అదే పార్టీకి చెందిన మధు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 8వ వార్డులో అధికారకార పార్టీ గుర్తుపై అనురాధ పోటీ చేస్తుండగా, అదే పార్టీకి చెందిన అఖిల స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 9వ వార్డులో అధికార పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్టీ బీఫారంతో గణేశ్, రాథోడ్ నరేష్‌కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు. 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా తౌఫిక్‌ను ప్రకటించగా, టి.శ్రీధర్ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. ఒకటో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా ఆనంద్ బరిలో నిలవగా, అదే పార్టీకి చెందిన ప్రతాప్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు.
మొయినాబాద్ మున్సిపాలిటీలోని 13వ వార్డులో అధికార కాంగ్రెస్ నుంచి ఇద్దరు బరిలో నిలిచారు. వీరిలో పార్టీ బీఫాంతో యాలాల లావణ్య పోటీకి దిగగా, ఇదే పార్టీకి చెందిన గడ్డం లక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 22వ వార్డులో బీజేపీకి రెబల్స్ బెడద తప్పలేదు. పార్టీ బీ ఫారంపై గున్నాల గోపాల్‌రెడ్డి నామినేషన్ వేయగా, అదే పార్టీకి చెందిన గరుగు రాజు స్వతంత్ర అభ్యర్థిగా దిగారు.
షాద్‌నగర్ మున్సిపాలిటీలోని 8వ వార్డులో అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలకు రెబల్ పోటు తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ బీ ఫారంతో జయప్రకాష్ పోటీ చేయగా, అదే పార్టీకి చెందిన వర్ష స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ బీ ఫారంతో భిక్షపతి పోటీ చేయగా, అదే పార్టీకి చెందిన సుధీర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా మంగళవారం 178 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వీరిలో బీజేపీ నుంచి 19 మంది, సీపీఎం నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి 78 మంది, బీఆర్‌ఎస్ నుంచి 45 మంది, ఎంఐఎం నుంచి ముగ్గురు, సీపీఐ, జనసేనల నుంచి ఒక్కొక్కరు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి నలుగురు, స్వతంత్రులు 22 మంది ఉన్నారు.
ఇక అసలు సమరం
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
ఆయా పార్టీల నుంచి అభ్యర్థుల ఖరారు
పలుచోట్ల తిరుగుబావుటా
స్వతంత్రులుగా బరిలోకి..
నేటి నుంచి ప్రచారంపై ఫుల్ ఫోకస్
నార్ముల్ మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి
దంగల్
దంగల్
దంగల్
దంగల్
దంగల్
దంగల్
దంగల్
దంగల్


