ఫుడ్ కోర్టులో అగ్ని ప్రమాదం
మీర్‌పేట: షార్ట్ సర్క్యూట్‌తో ఫుడ్ కోర్టులోని ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగ్‌పేటకు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న టెస్టీ ఫుడ్ కోర్టులో గురువారం తెల్లవారుజామున విద్యుత్ మీటర్ల వద్ద ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి. అందులో పనిచేసే ఓ యువకుడు గమనించి మొదట నీళ్లు పోసినా మంటలు అదుపులోకి రాకపోగా కోర్టులోని అన్ని షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఫుడ్ కోర్టులోని ఫర్నిచర్, నిల్వ ఉంచిన బిల్డింగ్ మెటీరియల్, విద్యుత్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయని, సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మీర్‌పేట ఎస్‌ఐ నాగభూషణం చెప్పారు.
రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం


