కఠినంగా శిక్షించాలి
యువ న్యాయవాది స్వప్న హత్యోదంతం ఎంతగానో బాధించిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం కేతిరెడ్డిపల్లికి వచ్చిన ఆమె, స్వప్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వప్న మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు సత్వరం శిక్ష పడేలా చూడాలన్నారు. ఆమె వెంట స్థానిక సర్పంచ్ గొడుగు యాదయ్య, ఉప సర్పంచ్ అనితరెడ్డి, మాజీ సర్పంచ్ గోటికె రమేశ్ తదితరులు ఉన్నారు.


