ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం

Feb 7 2026 3:00 PM | Updated on Feb 7 2026 3:00 PM

ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం

ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం

● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

చేవెళ్ల: పదేళ్లలో గత పాలకులు భ్రష్టు పట్టించిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే ప్రజా జీవితాల్లో మార్పుకోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని, అభివృద్ధి సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. చేవెళ్లలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకే ఎజెండా కింద పనిచేస్తున్నా యని తెలిపారు. రెండేళ్లుగా పాలనను ఒక క్రమ పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నామని.. పేదలకు రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని వివరించారు. తెలంగాణ రైజింగ్‌ పేరుతో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. చేవెళ్ల పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్‌ ముధుసూదన్‌రెడ్డి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ చింపుల సత్యనారాయణరెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్‌, నాయకులు బొంతు రామ్మోహన్‌, గౌరీ సతీష్‌, ఎం.బాల్‌రాజ్‌, మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జిలు నర్సారెడ్డి భూపతిరెడ్డి, ఫయూం, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement