అశ్లీల పదజాలంతో ఇన్‌స్టాలో పోస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అశ్లీల పదజాలంతో ఇన్‌స్టాలో పోస్ట్‌

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

అశ్లీల పదజాలంతో ఇన్‌స్టాలో పోస్ట్‌

అశ్లీల పదజాలంతో ఇన్‌స్టాలో పోస్ట్‌

పోలీసులను ఆశ్రయించిన సినీనటి ఇషారెబ్బ

నిందితుడిపై కేసు నమోదు

బంజారాహిల్స్‌: తన ఇన్‌స్ట్రాగామ్‌ పోస్టులపై అసభ్యకరమైన కామెంట్స్‌ పెట్టాడని, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సినీనటి ఇషారెబ్బ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఇటీవల ఇషారెబ్బ తన ఇన్‌స్టాలో ఓ ప్రముఖ దర్శకుడి డైరెక్షన్‌లో పని చేయాలని ఉందని పోస్ట్‌ చేశారు. రీల్‌ మాయ అనే అకౌంట్‌తో ఉన్న వ్యక్తి ఇన్‌స్టాలో ఆమె ప్రతిష్టను దెబ్బతీసేలా అసభ్యకర పోస్టులు పెట్టాడు. ఒక సినిమా ప్రచార కార్యక్రమం సందర్భంగా సోషల్‌ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇషారెబ్బ ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోద చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement