ముగిసిన ఓటింగ్
చేవెళ్ల/మొయినాబాద్:: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని 274 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాతంగా ముగిసాయని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఓటర్లు క్యూలో వేచియుండే పరిస్థితి లేకుండా ఒక్కో బూత్‌లో 500–600ల మంది ఓటర్లు ఉండేలా కేటాయించామన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను పోలీస్ బందోబస్తు మద్య స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలిస్తామన్నారు. 13వ తేదీన ఆయా మున్సిపాలిటీలకు కేటాయించిన కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆయన వెంట జెడ్పీ డిప్యూటీ సీఈఓ రంగారావు, చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం, చేవెళ్ల తహసీల్దార్ కృష్ణ, పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు.
స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాతంగా జరగుతున్నాయని ఫ్యూచర్‌సిటీ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. బుధవారం ఆయన చేవెళ్ల మున్సిపలిటీలోని 16, 17, 18 వార్డుల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలిస్తారన్నారు. అక్కడ మూడంచల భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కౌటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, సమావేశాలకు అనుమతి ఉండదని చెప్పారు. చేవెళ్ల డివిజన్ డీసీసీ యోగేశ్‌గౌతమ్ చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సీపీ వెంట చేవెళ్ల ఏసీపీ కిషన్, సీఐ భూపాల్‌శ్రీధర్, సిబ్బంది, తదితరులు ఉన్నారు. మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్ చిలుకూరు, హిమాయత్‌నగర్, పెద్దమంగళారం, మొయినాబాద్, అజీజ్‌నగర్‌లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి


