బిడ్డకు ఐస్‌క్రీం కోసం వెళ్లి తల్లి దుర్మరణం: రాత్రంతా తల్లి శవం వద్దే చిన్నారి | Missing Pregnant Woman Found Dead In Maharashtra, 4 Years Old Son Sits Beside Corpse All Night - Sakshi
Sakshi News home page

బిడ్డకు ఐస్‌క్రీం కోసం వెళ్లి తల్లి దుర్మరణం: రాత్రంతా తల్లి శవం వద్దే చిన్నారి

Oct 20 2023 11:24 AM | Updated on Oct 20 2023 11:59 AM

Missing pregnant woman found dead inin Maharashtra 4 yearold son sits beside corpse  - Sakshi

మహారాష్ట్రలో కనిపించకుండా పోయిన గర్భిణి ఉదంతం చివరికి విషాదాంతమైంది. రాజురా-బల్లార్‌పూర్ రోడ్డులోని వార్ధా నది వంతెన సమీపంలో సుష్మ మృతదేహం కనిపించడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  అంతేకాదు సుష్మ మృతదేహం పక్కనే  ఆమె నాలుగేళ్ల కుమారుడు ఏడుస్తూ కనిపించిన దృశ్యం  మరింత కలిచి వేస్తోంది.   ఈ ఘనటపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సంఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే చంద్రాపూర్‌కు చెందిన సుష్మా కక్డే బుధవారం రాత్రి అదృశ్యమైంది. ఐస్‌క్రీం కోసం తన నాలుగేళ్ల కుమారుడితో  ఇంటినుంచి బైటికి వెళ్లి ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె భర్త, బ్యాంక్ ఉద్యోగి పవన్‌కుమార్, బంధువులు ఆమె కోసం వెతికారు. కానీ ఫలితం లేక పోవడంతో,  బల్లార్‌పూర్ పోలీసులను ఆశ్రయించారు.  గురువారం ఉదయం నది వంతెన సమీపంలో మృతదేహాన్ని గుర్తించామని పోలీసు ఉన్నతాధికారి  రవీంద్ర సింగ్ పర్దేసి వెల్లడించారు. బుధవారం అర్థరాత్రి వంతెనపై నుండి పడి బురద ప్రాంతంలో కూరుకుపోయి ఉంటుందని పోలీసుల  ప్రాథమిక అంచనా.  అయితే, అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామిన పరదేశి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement