Telangana Crime News: చెరువులో ఈతకు వెళ్లి యువకుడు మృతి
Sakshi News home page

చెరువులో ఈతకు వెళ్లి యువకుడు మృతి

Oct 17 2023 2:00 AM | Updated on Oct 17 2023 6:09 AM

- - Sakshi

నల్గొండ: చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ యుగేంధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా నారపల్లికి చెందిన వారణాసి తరుణ్‌(24) తన స్నేహితుడు డీకొండ నితిన్‌తో కలిసి ఆదివారం బీబీనగర్‌లో ఉంటున్న మరో స్నేహితుడిని కలిసేందుకు వచ్చారు.

స్నేహితుడిని కలిసిన తర్వాత తరుణ్‌, నితిన్‌ కలిసి బీబీనగర్‌ మండలంలోని వరంగల్‌–హైదరాబాద్‌ హైవే పక్కన పెద్ద చెరువు వద్దకు వెళ్లారు. తరుణ్‌, నితిన్‌ చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. తరుణ్‌ చెరువులోరాళ్ల మధ్యన ఇరుక్కపోయాడు. నితిన్‌ బయటకు వచ్చి స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు చెరువు వద్దకు చేరుకొని తరుణ్‌ కోసం గాలింపు చర్యలు ఆచూకీ లభించలేదు. సోమవారం చెరువులో తరుణ్‌ మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తరుణ్‌ ముఖంపై గాయాలు ఉండడంతో నితిన్‌పై అనుమానం ఉన్నట్లు మృతుడి తండ్రి గోవిందాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement