జీడిమెట్లలో ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం | Hyderabad: Two Minor Girls From Jeedimetla Goes Missing, Know In Details - Sakshi
Sakshi News home page

జీడిమెట్లలో ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం

Published Wed, Sep 27 2023 8:38 AM | Last Updated on Wed, Sep 27 2023 10:49 AM

Two girls from Jeedimetla go missing - Sakshi

హైదరాబాద్: ఇంట్లో చెప్పాపెట్టకుండా ఇద్దరు బాలికలు వెళ్లిపోయిన సంఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ఎం.పవన్‌ చెప్పిన వివరాల ప్రకారం.. చింతల్‌ ద్వారకానగర్‌కు చెందిన శ్రీనివాస్, విజయ్‌ ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. శ్రీనివాస్‌ కుమార్తె దీక్షిత 9వ తరగతి, విజయ్‌ కుమార్తె పూజ పదో తరగతి చదువుతున్నారు.  వీరిద్దరూ వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్నప్పటికీ.. పొరుగు ఇళ్లలో ఉండటంతో  స్నేహితులయ్యారు. పూజ రెండు రోజుల క్రితం వినాయక మండపం వద్దకు వెళ్లడంతో తల్లిదండ్రులు మందలించారు.

 మంగళవారం ఉదయం స్కూల్‌కు వెళ్లేందుకు యూనిఫాం వేసుకుంది. పాలు తాగుతుండగా అవి మీద పడటంతో డ్రెస్‌ మార్చుకుంది. పక్కింట్లో ఉండే దీక్షిత బయట నుంచి గడియపెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇద్దరూ ప్రణాళిక ప్రకారమే 8 గంటల కంటే ముందే ఇళ్లలోంచి వెళ్లిపోయారు. దీక్షిత బాత్రూంకు గడియ పెట్టడం, పూజ డ్రెస్‌ మార్చుకోవడంపై అనుమానం వచి్చన ఇరువురి తల్లిదండ్రులు చుట్టు పక్కల వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో జీడిమెట్ల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 

పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఇద్దరు బాలికలు సికింద్రాబాద్‌లో రైలు ఎక్కి వరంగల్‌ వెళ్లినట్లు  గుర్తించారు. వరంగల్‌ నుంచి ఆంధ్రాకు గాని చెన్నైకి గాని వెళ్లే అవకాశం ఉందని, ఓ బాలిక బంధువు సంగారెడ్డికి చెందిన యువకుడికి పూర్తి విషయాలు తెలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు యువకుడిని ప్రశ్నించేందుకు జీడిమెట్ల ఠాణాకు తీసుకువచ్చినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement