నదిలో పడ్డ బస్సులు.. 65 మంది గల్లంతు | Landslide Sweeps 2 Buses In Nepal, 63 People Missing | Sakshi
Sakshi News home page

బస్సులపై విరిగిపడ్డ కొండ చరియలు.. 65 మంది గల్లంతు

Jul 12 2024 8:36 AM | Updated on Jul 12 2024 11:28 AM

Landslide Sweeps 2 Buses In Nepal, 63 People Missing

ఖట్మాండు: నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి ఘోర ప్రమాదం జరిగింది. మడన్‌-ఆశ్రిత్‌ హైవేపై శుక్రవారం(జులై 12) తెల్లవారుజామున కొండ  చరియలు విరిగి పడ్డాయి. హైవేపై ప్రయాణిస్తున్న రెండు బస్సులపై భారీ  కొండ రాళ్లు పడ్డాయి. 

దీంతో బస్సులు నదిలో పడిపోయాయి. బస్సులు నదిలో పడిపోయి మొత్తం 65 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది.  వీరిలో ఏడుగురు భారతీయులున్నట్లు సమాచారం.

గల్లంతైన వారి కోసం గాలింపు  ఆపరేషన్‌ కొనసాగుతోందని, అయితే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గాలింపు చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రధాన మంత్రి పుష్ఫ కమాల్‌ ప్రచండ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement