విశాఖ సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు | Six Fishermen Missing In Visakhapatnam Seaport | Sakshi
Sakshi News home page

విశాఖ సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు

Apr 2 2024 5:16 PM | Updated on Apr 2 2024 5:39 PM

Six Fishermen Missing In Visakhapatnam Seaport - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విశాఖపట్నం:  విశాఖపట్నం సముద్రంలో ఆరుగురు మత్య్సకారులు గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సోమవారం సాయంత్రం విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు చేపల వేటకు వెళ్లారు. వైజాగ్ హార్బర్ నుంచి V 1-MO -2736  నెంబర్ బోట్‌లో వేటకు వెళ్లారు.

రాత్రి గడిచినా వారు ఇంటికి చేరకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మంగళవారం కోస్ట్‌గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఫిషింగ్‌ బోట్లు, కోస్ట్‌గార్డు సాయంతో మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన మత్సకారుల స్వస్థలం విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందినవారిగా సమాచారం.
చదవండి: చంద్రబాబుకు దెబ్బేసిన ఎల్లో మీడియా!

Advertisement
 
Advertisement
Advertisement