breaking news
visakhapatnam sea
-
విశాఖ సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం సముద్రంలో ఆరుగురు మత్య్సకారులు గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సోమవారం సాయంత్రం విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు చేపల వేటకు వెళ్లారు. వైజాగ్ హార్బర్ నుంచి V 1-MO -2736 నెంబర్ బోట్లో వేటకు వెళ్లారు. రాత్రి గడిచినా వారు ఇంటికి చేరకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మంగళవారం కోస్ట్‌గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఫిషింగ్ బోట్లు, కోస్ట్‌గార్డు సాయంతో మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన మత్సకారుల స్వస్థలం విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందినవారిగా సమాచారం. చదవండి: చంద్రబాబుకు దెబ్బేసిన ఎల్లో మీడియా! -
ఆర్కే బీచ్‌లో గల్లంతైన వారి కోసం గాలింపు
విశాఖపట్నం: విశాఖ నగరంలోని ఆర్కే బీచ్‌లో గల్లంతైన యువకుల కోసం సోమవారం సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే రెండు మృతదేహలు సోమవారం ఉదయం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో రెండు మృతదేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆదివారం ఆర్కే బీచ్ వద్ద సముద్రంలో స్నానాలు చేస్తున్న నలుగురు యువకులు సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. మృతుల్లో ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు కాగా. ఒకరు పర్యాటకుడు. గతేడాది సరిగ్గా ఇదే రోజున విశాఖపట్నం నగరాన్ని హుద్ హుద్ తుపాన్ అతలాకుతలం చేసిన విషయం విదితమే.