ఆర్కే బీచ్లో గల్లంతైన వారి కోసం గాలింపు | Rescue team searching for two dead bodies in visakhapatnam sea | Sakshi
Sakshi News home page

ఆర్కే బీచ్లో గల్లంతైన వారి కోసం గాలింపు

Oct 12 2015 7:33 AM | Updated on Aug 25 2018 6:06 PM

విశాఖ నగరంలోని ఆర్కే బీచ్లో గల్లంతైన యువకుల కోసం సోమవారం సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

విశాఖపట్నం: విశాఖ నగరంలోని ఆర్కే బీచ్లో గల్లంతైన యువకుల కోసం సోమవారం సముద్రంలో  గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే రెండు మృతదేహలు సోమవారం ఉదయం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో రెండు మృతదేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఆదివారం ఆర్కే బీచ్ వద్ద సముద్రంలో స్నానాలు చేస్తున్న నలుగురు యువకులు సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. మృతుల్లో ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు కాగా. ఒకరు పర్యాటకుడు. గతేడాది సరిగ్గా ఇదే రోజున విశాఖపట్నం నగరాన్ని హుద్ హుద్ తుపాన్ అతలాకుతలం చేసిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement