శునకం చిత్రం చూపి.. కనకం చోరీ | Thieves Snatched Gold Chain From Woman Neck After Showing A Photo Of The Dog In Mysore | Sakshi
Sakshi News home page

శునకం చిత్రం చూపి.. కనకం చోరీ

Jun 20 2025 9:32 AM | Updated on Jun 20 2025 10:53 AM

Our dog is missing have you seen it?

మైసూరు : మా కుక్క పోయింది,మీరేమైనా చూశారా అని ఓ మహిళా రైతుకు కుక్క ఫొటోను చూపించిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని కనకం గొలుసును లాక్కొని పరారైన ఘటన మైసూరు తాలూకా ఇలవాల ఫిర్కా కల్లూరు నాగనహళ్లి గ్రామంలో జరిగిం ది. గ్రామ నివాసి కుళ్లేగౌడ భార్య కుమారి (47) బాధితురాలు.ఆమె పశువులకు నీరు తాగించేందుకు చిక్కెరె వద్దకు వెళ్లారు.

ఆ సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెను పలకరించి కుక్క ఫొటోను చూపించి ఇది తమ కుక్కేనని, తప్పిపోయిందని, మీరే మైనా చూశారా అని అడిగారు. ఆమె కుక్క ఫోటోను చూస్తుండగా మెడలోని రూ.3.20 లక్షల విలువ చేసే 37 గ్రాముల బంగారు మం గళసూత్రాన్ని లాక్కొని పరారయ్యారు. బాధితురాలు కేకలు వేసినా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఫలితం లేకపోయింది. ఇలవాల ఠాణాలో ఫిర్యాదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement