న్యూఢిల్లీ: గురునానక్ దేవ్ 556వ జయంతి సందర్భంగా ‘ప్రకాశ్ పుర్బ్’ వేడుకల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు వెళ్లిన భారత్‌లోని పంజాబ్‌కు చెందిన ఒక మహిళా యాత్రికురాలు తిరిగి రాలేదు. సర్బ్‌జిత్ కౌర్‌గా గుర్తించిన ఈ మహిళ పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలోని అమానిపూర్ గ్రామానికి చెందినది. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పంజాబ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
సర్బ్‌జిత్ కౌర్ 2025, నవంబర్ 4న అట్టారి-వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్‌కు చేరుకున్నారు. ఆమె 1,900 మందికి పైగా సిక్కు సభ్యులతో కూడిన ‘జాతా’ (తీర్థయాత్ర సమూహం)లో భాగంగా వెళ్లారు. ఈ బృందం గురుద్వారా నంకనా సాహిబ్‌లో ప్రార్థనలు నిర్వహించేందుకు, ఇతర చారిత్రక సిక్కు మందిరాలను సందర్శించేందుకు 10 రోజుల యాత్రకు వెళ్లింది. అయితే గురువారం రాత్రి ఈ బృందం భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, సర్బ్‌జిత్ కౌర్ వారిలో లేరు. ఆమె తిరిగి రాకపోవడాన్ని గుర్తించిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.
#WATCH | Kapurthala, Punjab | Station House Officer (SHO) of Talwandi Chaudhrian, Nirmal Singh says, "Sarbjit Kaur, a resident of Amanipur village in Kapurthala, was part of the jatha which went to Nankana Sahib, Pakistan. She did not return. The police are conducting an… pic.twitter.com/fPpMWzjcuK
— ANI (@ANI) November 14, 2025
ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. తల్వాండి చౌదరియన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)నిర్మల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ కపుర్తలాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే దీనిపై కేసు నమోదయ్యిదన్నారు. భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు కౌర్ కుటుంబ సభ్యుల నుంచి, ఆమె గ్రామం నుంచి మరింత సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె అదృశ్యం వెనుక కారణాలు, ఆమె పాకిస్తాన్‌లో ఉండిపోయారా? లేదా మరేదైనా జరిగిందా? అనే కోణాల్లో పోలీసు దర్యాప్తు జరుగుతోంది.
గురువారం తిరిగి వచ్చిన ఈ యాత్రికుల బృందం ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్‌కు వెళ్లిన మొదటి ‘జాతా’ కావడం గమనార్హం. గతంలో పలు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాకిస్తాన్‌కు ప్రయాణ ఆంక్షలు విధించింది. గత జూన్‌లో మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతికి సిక్కులు పాకిస్తాన్‌ను సందర్శించకుండా నిషేధించారు. సుమారు రెండు వారాల నిరాకరణ తర్వాత, అక్టోబర్ రెండున కేంద్ర ప్రభుత్వం ఈ తీర్థయాత్రకు అనుమతి ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రయాణ ఆంక్షలను మరింత కఠినతరం చేయడంతో, ప్రస్తుతం భారత పౌరులు మాత్రమే అట్టారి సరిహద్దు ద్వారా ప్రయాణించగలుగుతున్నారు. ఈ కఠిన నిబంధనల మధ్య యాత్రికురాలు అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: Bihar Election: ఈ ఐదుగురు.. ‘ఉత్కంఠ విజయులు’


