
చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలతో మెప్పించిన వాసంతిక మిస్సింగ్ అంటూ రెండురోజులుగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. చాలామందికి అసలు విషయం ఏంటి అనేది తెలియలేదు. ఒక హాస్టల్ నుంచి వెళ్తున్న సీసీటీవి ఫుటేజ్ కూడా విడుదల చేయడంతో చాలామంది నిజమేనని అనుకున్నారు. అయితే, అసలు విషయం తను నటిస్తున్న కొత్త సినిమా గురించి. ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ వాసంతిక ఇచ్చింది. ఇప్పటికే 90's - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ చిత్రంలో దివ్య అనే పాత్రతో మెప్పించన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల
D/o ప్రసాద్‌రావు కనబడుటలేదు అనే సినిమాలో వాసంతిక ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ టైటిల్‌ను చూస్తే అర్థం అయింది కదా. ఒక యువతి మిస్సింగ్ స్టోరీతో మూవీని తెరెక్కించారు. అందుకే సినిమా ప్రమోషన్ కోసం ఇలా హీరోయిన్ మిస్సింగ్ అంటూ ఒక వీడియోను వైరల్ చేశారు. ఈ చిత్రం డైరెక్ట్‌గా జీ5లో విడుదల కానుంది. అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో ఉధయబాను, రాజీవ్ కనకాల కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు.
నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వాసంతిక మెప్పించింది. సలార్‌లో కూడా ఆమె నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె కీలక పాత్రలో నటించిన సినిమా ఓటీటీలో విడుదల కానుంది.
Swathi is missing.
Family is in panic, the world is spinning.
What next?
Start tuned to know what happened to Swathi, D/o Prasadrao#SriRamVenkat #SouthIndianScrenss #ZEE5 #DaughterOfPrasadRaoKanabadutaledhu #ZEE5Telugu #RaajeevKanakala #UdayaBhanu #VasanthikaMacha pic.twitter.com/ZlpUnZWTrb— ZEE5 Telugu (@ZEE5Telugu) October 15, 2025