
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ఆర్కే బీచ్‌లో సరదాగా స్నానానికి దిగి ఒకరు మృతి చెందగా.. ఒకరు క్షేమంగా బయపడ్డారు. మరొకరు గల్లంతయ్యారు. మునిగిపోతున్న మహిళను కాపాడడానికి వెళ్లిన ఒడిశాకు చెందిన 22 ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. అతని కోసం సహాయక బృందాలు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాయి.
బీచ్ చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన దంపతులు రాగా.. సరదాగా బీచ్‌లోకి దిగగా.. కెరటాల ఉధృతికి మహిళ (50) కొట్టుకుపోయింది. భార్య మృతి చెందగా, భర్తను స్థానికులు కాపాడారు. దంపతులను కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి మృతి చెందాడు.