ఇండిగో నిర్వాకం: ఇక సీటు కుషన్‌కీ డబ్బులు అడుగుతారేమో? | Sakshi
Sakshi News home page

ఇండిగో నిర్వాకం: ఇక సీటు కుషన్‌కీ డబ్బులు అడుగుతారేమో?

Published Mon, Nov 27 2023 5:52 PM

IndiGo Passenger Finds Seat Cushion Missing On Flight Airline Responds - Sakshi

ఇండిగో విమానంలో  ఒక ప్యాసింజర్‌కి వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ప్రయాణీకులు తక్కువగా ఉన్నారని ప్రయాణికులను దించేసి వెళ్లి పోయిన ఘటన మరువకముందే  విమానంలో సీటు కుషన్ మిస్‌ అయిన ఘటన నెటిజనుల ఆగ్రహానికి కారణమైంది.

ఇండిగో ఫ్లైట్ 6E6798లో నాగపూర్‌కు వెళ్లేందుకు టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. అనుకున్న సమయనికి విమానం ఎక్కి, విండో సీట్‌ నెం 10A ఎంజాయ్‌ చేయాలన్న ఉత్సాహంతో దగ్గరికి వెళ్లి చూసి ఒక్కసారి షాక్‌  అయ్యారు.  సీటులోని కుషన్  మిస్‌ అయింది. కేవలం స్టీల్‌ ఫ్రేమ్‌ మాత్రమే కనిపించింది. ఇండిగో విమానంలో పూణె నుంచి నాగ్ పూర్ వెళ్తున్న సాగరిక పట్నాయక్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది.

దీంతో వెంటనే  క్యాబిన్‌ సిబ్బందిని సంప్రదించారు. సీటు కింద  ఉంటుంది చూడండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అలా కూడా లేకపోవడంతో  మళ్లీ  సిబ్బందిని అడిగే అప్పుడు  తీసుకొచ్చి కుషన్‌ అమర్చారు. అప్పటివరకు ఆమె నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది. సాగరిక భర్త సుబ్రత్ పట్నాయక్ దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

లాభాలను పెంచుకునే మార్గం ఇదేనా.. చాలా దారుణం అంటూ ట్వీట్‌ చేశారు.  బోర్డింగ్‌కు ముందు గ్రౌండ్ స్టాఫ్ , సిబ్బంది   నిర్లక్ష్యాన్ని సుబ్రత్  ప్రశ్నించారు. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది  ట్రయల్‌ కావచ్చు. త్వరలోనే ఇండిగో సీట్‌ కుషన్‌ల కోసం 250-500 వసూలు  చేస్తుందేమో  అంటూ ఒకరు సెటైర్లు వేశారు. 

మరోవైపు దీనిపై ఇండిగో స్పందించింది. అసౌకర్యానికి చింతిస్తున్నాం. సీటు కుషన్ దాని వెల్క్రో నుండి కొట్టుకుపోతుంది.దాన్ని సిబ్బంది రీప్లేస్‌ చేస్తుంది. భవిష్యత్తులో  మరింత మెరుగైన సేవలను అందిస్తామంటూ  ఇండిగో ఎయిర్ లైల్స్‌ వివరణ ఇచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement