ట్రంప్‌ నిజంగానే క్షేమమా? వైట్‌హౌజ్‌ గప్‌చుప్‌ | Social Media Curiosity on Donald Trump Missing Latest News Updates | Sakshi
Sakshi News home page

Trump Dead or Alive?: ట్రంప్‌ నిజంగానే క్షేమమా? వైట్‌హౌజ్‌ గప్‌చుప్‌

Aug 30 2025 7:35 PM | Updated on Aug 30 2025 8:11 PM

Social Media Curiosity on Donald Trump Missing Latest News Updates

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఎక్కడ?.. నిత్యం తనదైన శైలి ప్రకటనలు, నిర్ణయాలు, సోషల్‌ మీడియాలో పోస్టింగులతో హడావిడి చేసే ట్రంప్‌ ఉన్నట్లుండి సైలెంట్‌ అయిపోయారు. పైగా 79 ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్యంపై ఇటీవల వార్తలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అవసరమైతే తానే అధ్యక్ష బాధ్యతలు చేపడతానంటూ ప్రకటన చేశారు. ఈ వరుస పరిణామాల నడుమ.. ట్రంప్‌ మిస్సింగ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 

గత 24 గంటలుగా సోషల్‌ మీడియా మామూలుగా ఊగిపోవడం లేదు. ఏకంగా ట్రంప్‌ ఈజ్‌ డెడ్‌ అంటూ ఓ ట్రెండ్‌ సైతం నడుస్తోంది. పోను పోను ఆ ట్రెండ్‌ మరింత దారుణంగా మారింది. ట్రంప్‌ చనిపోయాడనే వార్త ధృవీకరించినవాళ్లకు డాలర్లు ఇస్తామంటూ పలువురు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. ట్రంప్‌ మీడియా ముందుకురాలేదు. ఏదైనా చెప్పాలనుకుంటే తన ‘ట్రూత్‌’ ద్వారానే వెల్లడిస్తున్నారు. అయితే.. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్‌ ఈవెంట్లు వైట్‌హౌస్‌ షెడ్యూల్‌లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. 

ట్రంప్‌ అనారోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్‌మీడియాలో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు వైట్‌హౌజ్‌గానీ, ఆయన వ్యక్తిగత సిబ్బందిగానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాకుంటే.. తన మనవరాలు కై మాడిసన్ ట్రంప్ (Kai Madison Trump) కలిసి వైట్‌హౌజ్‌ సౌత్‌ లాన్‌లో ఆయన గోల్ఫ్‌ ఆడినట్లు ఓ వీడియో వైరల్‌ అవుతోంది. 

ఆ సమయంలో అక్కడికి వచ్చినవాళ్లకూ ఆయన కరచలనం చేస్తూ కనిపించినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అది తాజా వీడియోనేనా? అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. 

‘‘గత 24 గంటలుగా ట్రంప్‌ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్‌ మీటింగ్‌లు లేవు. అసలు ఏం జరుగుతోంది?’’ అని ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్టు పెట్టడంతో ఈ వ్యవహారం మొదలైంది.

 

మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్‌ సోషల్‌ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. కుట్రపూరితంగానే ప్రచారం జరుగుతోందని ఆయన మద్దతుదారులు అంటున్నారు. సెప్టెంబర్‌ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్‌లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని కారణాలుగా పలువురు చెబుతున్నారు.

భారత్‌+రష్యా+చైనా = ట్రంప్‌నకు పీడకల అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. భవిష్యవాణిగా పేరొందిన సింప్సన్‌ కామిక్‌ సిరీస్‌ను ఉద్దేశించి.. ట్రంప్‌ ప్రాణాలతో లేకపోయి ఉండొచ్చు అని సెటైరిక్‌ మీమ్స్‌ వేస్తున్నారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకు వేసి.. జేడీ వాన్స్‌, ఎలాన్‌ మస్క్‌లలో ఎవరు తదుపరి అధ్యక్షుడు అయితే బాగుంటుందంటూ పోల్‌ పెట్టారు కూడా.

 

ఈ మధ్యకాలంలో 79 ఏళ్ల ట్రంప్‌ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ట్రంప్‌ చేతిపై గాయంతో కనిపించారు. గతంలో ఈ గాయాన్ని దాచడానికి ఆయన చేతికి మేకప్‌ వేసుకొని కనిపించారు. దీనిపై ట్రంప్‌ వైద్యుడు సీన్‌ బార్బబెల్లా స్పందించారు. ఆ గాయం నిజమేనని అంగీకరించారు. తరచుగా కరచాలనం చేయడం వల్ల, ఆస్ప్రిన్‌ వాడటం వల్ల ఇలా జరిగిందని వెల్లడించాడు. అయితే.. ట్రంప్‌ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. గోల్ఫ్‌ ఆడిన వీడియో అధికారికమని ధృవీకరణ అయితే.. ఊహాగానాలకు తెర పడినట్లే!.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement