
పూణె: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఛీటింగ్ వ్యవహారంలో సస్పెండ్ అయిన ఐఏఎస్ ప్రొబెషనర్ పూజా ఖేద్కర్ మరోమారు వార్తల్లో నిలిచారు. ముంబైలోని ఐరోలిలో కిడ్నాప్ అయిన ఓ ట్రక్ డ్రైవర్ పూణేలోని చతుశృంగి ప్రాంతంలో గల పూజా ఖేడ్కర్ ఇంట్లో కనిపించడం సంచలనంగా మారింది.
సామాజిక కార్యకర్త విజయ్ కుంభార్ ట్వీట్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివాదాస్పదురాలిగా మారి, సస్పెండ్ అయిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లి సాగించిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 13న ఐరోలి ప్రాంతంలోని సిగ్నల్ వద్ద ఓ ట్రక్ డ్రైవర్ కిడ్నాప్ అయ్యాడు. బాధితుడు నవీ ముంబైకి చెందిన ప్రహ్లాద్ కుమార్ (22). ఆయన తన మిక్సర్ ట్రక్కును తీసుకెళ్తూ ఒక కారును ఢీకొన్నాడు. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతనిని బలవంతంగా తమ కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. ఈ నేపధ్యంలో ప్రహ్లాద్ కుమార్ కనిపించడం లేదంటూ సంబంధీకులు రబాలే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Pune Video: Ex-IAS Probationer Puja Khedkar's Mother Confronts Police During Rescue Of Allegedly Kidnapped Driver From Her Home pic.twitter.com/zYkEsSyi7L
— Momentum News (@kshubhamjourno) September 14, 2025
కేసు దర్యాప్తులో భాగంగా అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఖరత్ ఆ కారును ట్రాక్ చేసే దిశగా పూణేకు వెళ్లారు. ఆ కారు వివాదాస్పద ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ ఇంటి లొకేషన్‌లో కనిపించింది. దీంతో ఖరత్ బృందం కిడ్నాప్ అయిన డ్రైవర్‌ను రక్షించినట్లు విజయ్ కుంభార్ తన ట్వీట్‌లో వివరించారు. ఈ కేసు దర్యాప్తు లో పూజా ఖేడ్కర్ తల్లి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిందని, కనీసం తలుపు కూడా చాలాసేపటి వరకూ తెరవలేదని సమాచారం. పోలీసులు పూజా ఖేడ్కర్ తల్లి చేసిన కిడ్నాప్ వ్యవహహారంపై దర్యాప్తు చేపట్టారు.