
ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. జేసీవో సహా 10 మంది ఆర్మీ జవాన్లు గల్లంతయినట్లు సమాచారం. ధరాలీలో ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు 12 మంది మృతి, 100 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, ఆర్మీ జవాన్లు 20 మంది పౌరులను కాపాడారు. హర్షిల్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వారికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. ప్రస్తుతం ధరాలీ గ్రామంలో ఎన్డీఆర్‌ఎఫ్. ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఉత్తరకాశీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ధరాలీ గ్రామంపై ఒక్కసారిగా జల ప్రవాహం విరుచుకుపడటంతో హోటళ్లు, నివాస భవనాలు కొట్టుకుపోయాయి.
రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది. 150 మంది సైనికులను ఘటనాస్థలానికి పంపినట్లు ఆర్మీ తన అధికారిక ‘ఎక్స్’లో పేర్కొంది. గ్రామం మొత్తం బురద నీటితో నిండిపోవడంతో సహాయక చర్యలకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
#uttarkashicloudburst
Nature’s Fury at its worst. Horrifying footage of the moment.
A #Cloudburst led to #flashfloods and #Landslide in the High Altitude village in #Dharali, #Uttarkashi in #Uttarakhand
People seen running away but are swept away in seconds
Several houses… pic.twitter.com/DPG9JDr3yF— Surya Reddy (@jsuryareddy) August 5, 2025