breaking news
Uttarakhand floods
-
జలప్రళయం
ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ఎంతగా ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నా బేఖాతరు చేస్తున్న మనిషిపై ప్రకృతి మరోసారి తన విశ్వరూపాన్ని చూపింది. దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్‌లోని ధరాలీ గ్రామంపై మంగళవారం ఉవ్వెత్తున విరుచుకుపడిన వరద అక్కడి ఇళ్లూ, హోటళ్లూ, రెస్టారెంట్లూ, దుకాణాలూ వగైరాలను ఊడ్చిపెట్టేయగా దాదాపు వందమంది ఆచూకీ తెలియటం లేదని వార్తలొస్తున్నాయి. హార్సిల్ ప్రాంతంలో ఉన్న సైనిక శిబిరం కొట్టుకుపోగా అందులోని పదిమంది జవాన్ల ఆచూకీ తెలియటం లేదు. కుంభవృష్టితో ఖీర్గంగా నది పోటెత్తి ఇంత విలయానికి దారితీసింది. ఆకస్మిక వరదకు అరగంట ముందే ధరాలీ మార్కెట్ ప్రాంతానికి విరిగిపడ్డ కొండచరియలు, బురద కొట్టుకొచ్చాయనీ, అంతలోనే భారీయెత్తున వరదనీరు విరుచుకుపడిందనీ స్థానికుల కథనం. ఆత్మరక్షణ కోసం సమీపంలోని కొండపైకి ఎక్కినవారికి ఖీర్‌గంగ పెనుగర్జన వినబడిందంటే ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే ఈ జలప్రళయం విరుచుకుపడింది. ప్రకృతి విలయం సంభవించినప్పుడల్లా ఎన్నో విషాద ఘట్టాలు ఆవిష్కృతమవుతాయి. ఇకపై అత్యంత జాగ్రత్తగా మెలగాలన్న సంకల్పమూ వినబడుతుంది. నెలలు కాదు... రోజులు గడిచేసరికే అదంతా మరుగునపడుతుంది. పర్యావరణాన్ని బేఖాతరు చేస్తూ నిర్మాణాలు మొదలవుతాయి. నదుల్ని దేవతలుగా కొలిచే సంప్రదాయం మనది. అయినా వాటికి అవరోధం కలిగించే నిర్మాణాలైనా, వాటిని కాలుష్యంలో ముంచే కర్మాగారాలనైనా అనుమతించరాదన్న గ్రహింపు పాలకులకు లేదు. గంగానదిని మాఫియాల బారి నుంచి కాపాడాలంటూ 2011లో ఉపవాసదీక్షకు పూనుకున్న స్వామి నిగమానంద ప్రాణత్యాగం చేసినా పాలకుల వైఖరిలో మార్పు లేదు. ఉత్తరాఖండ్‌కు విపత్తులు కొత్తగాదు. దశాబ్దాలుగా ఇంచుమించు ఏటా రివాజుగా వరదలొస్తాయి. గ్రామాలకు గ్రామాలు వరదనీటిలో చిక్కుకుంటాయి. కొన్నిసార్లు పెద్దగా సమస్యలేమీ లేకుండా ముగుస్తుంది. 2013లో సంభవించిన విలయం ఏకంగా 6,000 మందిని బలి తీసుకుంది. అంతకు ముందూ తర్వాతా కూడా పదుల నుంచి వందలమంది వరకూ మృత్యువాత పడిన సందర్భాలున్నాయి. అభివృద్ధి ముసుగులో ప్రకృతినీ, పచ్చటి ప్రాంతాలనూ ధ్వంసం చేయటం... వేర్వేరు ప్రాజెక్టులకు ఎడాపెడా అనుమతులీయటం మన దేశంలో పాలకులకు అలవాటైన జాడ్యం. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో వరదలొచ్చిన ప్రాంతం భాగీరథి పర్యావరణ జోన్ పరిధిలో ఉంది. దాన్ని అత్యంత జాగ్రత్తగా పరిరక్షించాల్సిన ప్రాంతంగా గుర్తించారు. 4,157 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఆ జోన్‌ను 2012లో నోటిఫైడ్ ప్రాంతంగా పరిగణించారు. అక్కడ జరిగే విచక్షణారహిత అభివృద్ధిని నియంత్రించటానికి ఉద్దేశించిన ఈ చర్య ఆచరణలో ఎందుకూ కొరగాకుండా పోయింది. నదులూ, ఉపనదుల సమీపంలో నిర్మాణాలు ఉండరాదన్న ఇంగితజ్ఞానం ఎవరికీ లేదు. ప్రతిష్ఠాత్మకమైన చార్ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టు సైతం ఆ ప్రాంతంలోనే ఉంది. పర్యావరణ ఉద్యమకారులు న్యాయ స్థానాల్లోనూ, వెలుపలా పోరాడినా... చివరకు ప్రభుత్వానిదే పైచేయి అయింది. ఏడాదిక్రితం 34వ జాతీయరహదారిపై హినా–టెక్లాల మధ్య నిర్మించతలపెట్టిన బైపాస్ రోడ్డు గురించి కూడా ఆందోళనలు జరిగాయి. ఆ ప్రాంతం ధరాలీకి దక్షిణంగా ఉంది.ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అమరికలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ధ్రువ ప్రాంతాల్లో, హిమపర్వతశ్రేణిలో మాత్రమే కుంభవృష్టి, ఆకస్మిక వరదలు ఉండేవి. అలాంటి రాతినేలలకు వరద నీటిని పట్టివుంచే గుణం తక్కువ. నిమిషాల వ్యవధిలో వరదలు పోటెత్తుతాయి. కొండచరియలు విరిగిపడి ముప్పును మరిన్నిరెట్లు పెంచుతాయి. పర్యావరణంలో వచ్చిన మార్పుల పర్యవసానంగా ప్రకృతి వైపరీత్యాలకు ఏ ప్రాంతమూ అతీతం కాని స్థితి వచ్చేసింది. వాతావరణాన్ని కొలవటానికి ఉపయోగించే నమూనాలు, ఉపకరణాలు ఒక్కోసారి విఫలం కావటానికి మారిన స్థితిగతులే కారణం. వేడిగాలులు ఎక్కువ తేమను పట్టి ఉంచుతాయి. ఒక డిగ్రీ ఉష్ణోగ్రత హెచ్చితే తేమ ఏడు శాతం పెరుగుతుందనీ, దీనికి అధికశక్తి ఉంటుందనీ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణంలో తేమ పెరిగినకొద్దీ వేడిగాలుల వల్ల ఆకస్మిక కుంభవృష్టికి అనువైన పరిస్థితులేర్పడతాయి. అందుకే ఉత్తరాఖండ్ వంటిచోట్ల మాత్రమే కాదు... అన్నిచోట్లా పర్యావరణాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటూ దానికి విఘాతం కలగనీయని రీతిలో ఆచరణ ఉండాలి. కానీ పట్టించుకునేదెవరు? అందుకే ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలు మారాలి. పర్యావరణానికి విఘాతం కలిగించే అవకాశమున్నదని భావించే ఎలాంటి ప్రాజెక్టునైనా నిస్సంకోచంగా తిరస్కరించాలి. ఇప్పుడొచ్చిన ఉత్పాతం ఆఖరిది కావాలి. -
ఉత్తరాఖండ్ వరదలపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,అమరావతి: ఉత్తరాఖండ్ వరదలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో వరద బాధితులను ప్రభుత్వం త్వరగా ఆదుకోవాలి. బాధితులకు వెంటనే పునరావాసం కల్పించటంతోపాటు, తగిన సహాయ చర్యలను చేపట్టాలి’అని కోరారు. Deeply shocked by the devastating floods in Uttarakhand.My thoughts and prayers are with the victims and their families during this incredibly difficult time.I hope the government will take swift and effective relief measures to support those affected and ensure their safety…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 6, 2025వరద విలయం కరాళ నృత్యందేవభూమి ఉత్తరాఖండ్‌ను బురద వరద అతలాకుతలం చేసింది. ఆధ్యాత్మిక ధామాలను దర్శించే పర్యాటకులతో ప్రకృతి సోయగాలతో అలరారే రమణీయమైన హిమాలయ గ్రామం ‘ధరాలీ’పై వరద విలయం కరాళ నృత్యం చేసింది. క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన బురద వరద ఆ గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలను భూస్థాపితం చేసింది.అప్పటిదాకా ప్రకృతి అందాలతో తులతూగిన ఉత్తరాఖండ్‌లోని ఆ గ్రామం ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. ఎగువ ప్రాంతాల వరద నీరు, బురద ముంచెత్తండతో ఆ ప్రాంతంలో రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయి. -
ఉత్తరాఖండ్‌లో బురద విలయం
ఉత్తరకాశీ(ఉత్తరాఖండ్): ఆధ్యాత్మిక ధామాలను దర్శించే పర్యాటకులతో ప్రకృతి సోయగాలతో అలరారే రమణీయమైన హిమాలయ గ్రామం ‘ధరాలీ’పై వరద విలయం కరాళ నృత్యంచేసింది. క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన బురద వరద ఆ గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలను భూస్థాపితం చేసింది. అప్పటిదాకా ప్రకృతి అందాలతో తులతూగిన ఉత్తరాఖండ్‌లోని ఆ గ్రామం ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది.ఎగువ ప్రాంతాల వరద నీరు, బురద ముంచెత్తిన దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని ఉత్తరకాశీ జిల్లా మేజి్రస్టేట్ ప్రశాంత్ ఆర్య చెప్పారు. 50 మందికిపైగా జనం జాడ గల్లంతైందని స్థానికులు చెబుతున్నారు. జాతీయ భద్రత, నిఘా కార్యక్రమంలో భాగంగా సమీప హార్సిల్లోయ ప్రాంతంలో ఏర్పాటుచేసిన భారత ఆర్మీ 14 రాజ్రిఫ్ యూనిట్ బేస్క్యాంప్పైనా బురద దూసుకొచ్చింది. దీంతో 10 మంది జవాన్లు, ఒక సైన్యాధికారి(జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్) జాడ సైతం గల్లంతైంది. తోటి జవాన్ల జాడ తెలీకుండాపోయినాసరే సడలని ధైర్యంతో ఇతర జవాన్లు సహాయక, అన్వేషణ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. నలుగురు చిన్నారులు, 11 మంది మహిళలు, 22 మంది పురుషులను ఘటనాస్థలి నుంచి సహాయక బృందాలు కాపాడాయి. డజన్ల కొద్దీ హోటళ్లు భారీ బురదలో కూరుకుపోయాయి. సమీప హెలిప్యాడ్ సైతం నాశనమైంది. మంగళవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రీ ధామం సమీపంలోని ధరాలీ గ్రామంపైకి ఎగువ ప్రాంతాల వరద ముంచెత్తిన వీడియో దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. హరిశీలా పర్వతం సమీపంలోని సత్తాల్ దగ్గరి కుంభవృష్టి కారణంగా ఒక్కసారిగా పెరిగిన ఖీర్గంగా నదీప్రవాహం హద్దులు దాటి దిగువక దూసుకొచి్చంది. ఈ వరదనీటితోపాటు వరద దిగువకు గంటకు 43 కిలోమీటర్ల వేగంతో కొట్టుకొచ్చి అక్కడ ఉన్న ధరాలీ గ్రామాన్ని ముంచెత్తి వినాశనం సృష్టించింది. ప్రకృతి ప్రకోపం వార్త తెల్సి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగి్నమాపక దళం, ఉత్తరాఖండ్ పోలీసులు, భారత ఆర్మీ బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ బలగాలూ ఇప్పటికే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. బురదలో కూరుకుపోయిన ఇళ్ల నుంచి మట్టిని తొలగిస్తున్నారు. బురదలో చిక్కుకుపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ చెప్పారు. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం తలెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో అతి తక్కువ సమయంలో అత్యంత తీవ్రస్థాయిలో క్లౌడ్‌బరస్ట్ కుండపోత వర్షం కారణంగా ఈ బురద ముంచెత్తిందని వాతావరణశాఖ అధికారులు వివరించారు. ఘటన తర్వాత కేదార్నాథ్ వైపు యాత్రికుల రాకను తాత్కాలికంగా ఆపేశారు. దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని సహాయక, అన్వేషణ చర్యల్లో పురోగతిపై ఆరా తీసేందుకు సీఎం ధామీకి ప్రధాని ఫోన్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం ఫోన్‌చేసి వివరాలు ఆరాతీశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనంగా జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బలగాలను పంపిస్తున్నట్లు సీఎంకు అమిత్‌షా చెప్పారు. ‘‘ధరాలీ దుర్ఘటనలో సర్వం కోల్పోయిన బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.ప్రాణాలతో బయటపడిన వాళ్లు ఈ విషాదఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ప్రారి్థస్తున్నా. గ్రామస్థులకు అన్నిరకాలుగా సాయపడేందుకు మా ప్రభుత్వం సదా సిద్ధంగాఉంది’’అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. మృతుల కుటుంబాలకు రక్షణమంత్రి రాజ్‌నాథ్, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. సహాయక చర్యల్లో నిమగ్నమై బాధితులకు సాయపడాలని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజ్ఞప్తిచేశారు. బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా కోరారు.ఎటు చూసినా బురదమయమే మెరుపు వరద ధాటికి గ్రామం చాలా వరకు ధ్వంసమైంది. ఇళ్లన్నీ బురదలో కూరుకుపోయాయి. కొండవాలు కింద ఇళ్లు నిర్మించుకున్న వాళ్లకు తప్పించుకునే అవకాశంలేకుండా పోయింది. పలువురిని బురద సజీవంగా కప్పేసింది. సమీప కొండ మీద నుంచి ఒకవ్యక్తి తీసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. అద్భుతం జరిగినట్లుగా ఆ బురదలోంచి ఒకరిద్దరు బయటికొచ్చి శక్తినంతా కూడదీసుకుని ముందుకు కదిలారు. అప్పటికే అలసిపోయి నాలుగు అడుగులేసి అక్కడే కుప్పకూలిపోయారు.మరో వ్యక్తి కాస్తంత బలం కూడదీసుకుని ఎగువ ప్రాంతం వైపు నడక ప్రారంభించాడు. ‘‘నీ దగ్గర్లో పడిపోయిన ఆ వ్యక్తిని కూడా పైకి లాక్కొని రా’’అని కొండ మీద జనం అరుస్తున్నట్లు ఆ వీడియోలో రికార్డయింది. ఒకతను సాయం చేయండండూ ఆ బురద మధ్యలో ఏడుస్తూ కనిపించాడు. కొందరు తమ వాళ్లకు వీడియోకాల్స్ చేసి తాము ఎక్కడ చిక్కుకుపోయామో వివరించే ప్రయత్నం చేశారు. ‘‘అంతా ముగిసిపోయింది’’అని ఒకతను మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటికొచి్చంది. కొందరు ఊపిరిబిగబట్టిమరీ తమ వారి జాడ కోసం వెతుకుతూ కనిపించారు.డెహ్రాడూన్‌లో రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రం నుంచి సహాయక, అన్వేషణ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి వినోద్ సుమన్ చెప్పారు. సమీప హార్సిల్, సుఖీ లోయ ప్రాంతాలనూ వరదనీరు ముంచెత్తే ప్రమాదం ఉండటంతో అక్కడి స్థానికులను పాలనాయంత్రాంగం అప్రమత్తంచేసింది. తక్షణం ఎగువ ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. ధరాలీ విలయవార్త తెలిసి సమీప దిగువ గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సుఖీ గ్రామంలోనూ కుండపోత వర్షం కురిసింది. అక్కడ కొండచరియలు విరిగిపడడంతో హార్సిల్, ధరాలీ మధ్యలో అప్పటికప్పుడు ఒక కృత్రిమ సరస్సు ఏర్పడింది.ఇందులోని నీరు పెరిగితే దిగువ ప్రాంతాలకు కొత్త ముప్పు ఏర్పడనుంది. 20–30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కేవలం 60 నిమిషాల్లోపు 10 సెంటీమీటర్ల స్థాయి వర్షపాతం నమోదైతే దానిని క్లౌడ్‌బరస్ట్‌గా చెబుతారు. వీటిని ముందస్తుగా ఊహించడం చాలా కష్టం. క్లౌడ్‌బరస్ట్ కారణంగా స్వల్ప వ్యవధిలోనే అపారజలరాశి వర్షపు నీటిబిందువుల రూపంలో స్వల్పప్రాంతంలో పడటంతో అక్కడ వరద పోటెత్తుతుంది. కొండప్రాంతమైతే కొండమట్టి నీటితో తడిసిపోయి మెత్తబడి కొండచరియలు విరిగిపడతాయి. దీంతో దిగువ ప్రాంతాల్లో అపార ప్రాణ, ఆస్తినష్టం సంభవించవచ్చు.ప్రకృతి ఒడిలో ప్రశాంత గ్రామం ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలీ గ్రామం ఒక్కసారిగా మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోవడంతో అసలు ఈ గ్రామం ఎక్కడుంది? అని చాలా మంది గూగుల్‌లో వెతకడం మొదలెట్టారు. యాపిల్స్‌కు ప్రసిద్ధిగాంచిన రాష్ట్రంలోని హర్సిల్ లోయ సమీపంలో ధరాలీ గ్రామం ఉంది. గంగోత్రి ధామాన్ని దర్శించే వాళ్లు కాసేపు విడిది కోసం మార్గమధ్యంలో ఉన్న ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. ఈ గ్రామ సమీపంలో భాగీరథి నది ప్రవహిస్తోంది. గ్రామం మీదుగా జాతీయ రహదారి వెళ్తుండటంతో ఇక్కడి పర్వతమయ ప్రకృతి సుందర దృశ్యాలను చూసేందుకు ఎక్కువ మంది యాత్రికులు ఇక్కడ ఆగుతారు.చార్ధామ్ సహా ఇతర తీర్థయాత్రల సమయాల్లో ఈ గ్రామానికి పెద్దసంఖ్యలో జనం వస్తారు. ఇక్కడ అతిథి గృహాలు, లాడ్జీలు ఎక్కువ. అది కూడా తక్కువ ధరలకే విడిది సౌకర్యాలు లభిస్తుండటంతో సందర్శకులు, భక్తులు, యాత్రికులు ఈ గ్రామంలో కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. సముద్రమట్టానికి దాదాపు 2,680 మీటర్ల ఎత్తులో ఈ గ్రామం ఉంది. ఈ ఘటనకు తోడు సమీపంలో కొండచరియలు విరిగి పడినఘటనల్లో ఐదు జాతీయరహదారులు సహా 163 చోట్ల రోడ్లపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.ఏడు రాష్ట్రరహదారులు, రెండు సరిహద్దు రోడ్లపైనా కొండచరియలు విరిగిపడ్డాయి. బుధవారం సైతం భారీ వర్షాలు కురిసే వీలుందని వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. నైనిటాల్, చంపావత్, ఉధమ్‌సింగ్ నగర్, బగేశ్వర్, పౌరీ తెహ్రీ, హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హిమాలయ దిగువ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, కొండచరియలు విరిగిపడే ఘటనలు సర్వసాధారణం. మిగతా హిమాలయ ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్ ఘటనలు మరీ ఎక్కువ. -
Uttarakhand: కొట్టుకుపోయిన ఆర్మీ బేస్ క్యాంప్!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. జేసీవో సహా 10 మంది ఆర్మీ జవాన్లు గల్లంతయినట్లు సమాచారం. ధరాలీలో ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు 12 మంది మృతి, 100 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.కాగా, ఆర్మీ జవాన్లు 20 మంది పౌరులను కాపాడారు. హర్షిల్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వారికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. ప్రస్తుతం ధరాలీ గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఉత్తరకాశీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ధరాలీ గ్రామంపై ఒక్కసారిగా జల ప్రవాహం విరుచుకుపడటంతో హోటళ్లు, నివాస భవనాలు కొట్టుకుపోయాయి.రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది. 150 మంది సైనికులను ఘటనాస్థలానికి పంపినట్లు ఆర్మీ తన అధికారిక ‘ఎక్స్’లో పేర్కొంది. గ్రామం మొత్తం బురద నీటితో నిండిపోవడంతో సహాయక చర్యలకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.#uttarkashicloudburstNature’s Fury at its worst. Horrifying footage of the moment.A #Cloudburst led to #flashfloods and #Landslide in the High Altitude village in #Dharali, #Uttarkashi in #UttarakhandPeople seen running away but are swept away in secondsSeveral houses… pic.twitter.com/DPG9JDr3yF— Surya Reddy (@jsuryareddy) August 5, 2025 -
జల విలయం: ఆ రాళ్ల కుప్ప కుప్పకూలిందా ?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ జల విలయంలో మృతుల సంఖ్య 31కి చేరుకుంది. విద్యుత్ ప్రాజెక్టు సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికుల్ని కాపాడడానికి సహాయ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మంగళవారం నాడు మరో అయిదు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 175 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. రైణి గ్రామంలోని శిథిలాల్లో రెండు మృతదేహాలు లభించినట్టుగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) అధి కారి ఒకరు చెప్పారు. గల్లంతైన వారంతా ఎన్టీపీసీకి చెందిన నిర్మాణంలో ఉన్న తపోవన్–విష్ణుగఢ్, రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టుల్లో పని చేస్తున్నవారు, దాని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలే ఉన్నారు. శిథిలాలు తొలగించడానికి భారీ మిషన్లు 12 అడుగుల ఎత్తు, 2.5 కి.మీ. పొడవైన సొరంగ మార్గంలో వరద నీటిలో కార్మికులు చిక్కుకొని ఉండడంతో సహాయ చర్యలు క్లిష్టంగా మారాయి. ఐటీబీపీ, ఎన్డీఆర్ఫ్లతో పాటు రాష్ట్ర సహాయ సిబ్బంది ఆ సొరంగ మార్గంలోని శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద యంత్రాలను తీసుకువచ్చి విరామమెరుగకుండా పని చేస్తున్నారు. ‘‘రాత్రి నుంచి నిరంతరాయంగా పని చేస్తూ ఉంటే సొరంగ మార్గంలో 120 మీటర్ల వరకు శిథిలాలను తొలగించగలిగాం’’అని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ కుమార్ పాండే చెప్పారు. ఇక వంతెనలు ధ్వంసం కావడంతో పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. మొత్తం 13 గ్రామాలకు చెందిన 2,500 మంది బిక్కు బిక్కుమంటూ ఉన్నారు. వారందరికీ హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర సరుకుల్ని అందిస్తున్నారు. సీఎం ఏరియల్ సర్వే వరద గుప్పిట్లో చిక్కుకున్న ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఏరియల్ సర్వే నిర్వహించారు. జోషిమఠ్‌లోని ఐటీబీపీ ఆస్పత్రిని సందర్శించారు. మరణం అంచుల వరకు వెళ్లి సురక్షితంగా వచ్చిన 12 మంది కార్మికులతో మాట్లాడారు. సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికే తాము ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా సీఎం తెలిపారు. వరద ప్రాంతాల్లో చికక్కుకున్న కొన్ని గ్రామాల్ని కూడా సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. ఆ పరికరమే కొంప ముంచిందా ..? 1960 దశకంలో చైనాపై నిఘా కోసం నందాదేవి పర్వత ప్రాంతాల్లో అమర్చడానికి తీసుకువెళ్లిన అణు ధార్మిక పరికరం ఇప్పుడు జలవిలయానికి దారి తీసిందని రైణి గ్రామస్తులు అనుమానిస్తున్నారు. మంచు చరియలు విరిగిపడిన రోజు భయంకరమైన వాసన వచ్చిందని, ఆ సమయంలో ఊపిరి తీయడం కష్టంగా మారిందని వరద బీభత్సంలో అత్యధికంగా నష్టపోయిన రైణి గ్రామవాసులు చెబుతున్నారు. కేవలం మంచుపెళ్లలు, శిథిలాల వల్ల అంత ఘాటైన వాసన రాదని ఆ పరికరం నందాదేవి పర్వత ప్రాంతాల్లోనే ఎక్కడో ఉందని తమ పెద్దలు చెబుతూ ఉండేవారని, బహుశా దాని కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని దేవేశ్వరి దేవి అనే మహిళ అనుమానం వ్యక్తం చేశారు. నందాదేవి పర్వత ప్రాంతాల్లో ఇలాంటి పరికరం ఏదో ఉందని ఇప్పటికే పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చైనా కదలికలపై నిఘా ఉంచడానికి సీఐఏ, ఐబీలు సంయుక్తంగా అణు శక్తి కలిగిన ఒక పరికరాన్ని నందాదేవి పర్వతాల్లో అమర్చడానికి 1965లో తీసుకువెళ్లారని, అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ పరికరాన్ని అక్కడే వదిలేసి వచ్చారని అంటారు. ఏడాది తర్వాత ఒక పర్వతారోహక బృందం అక్కడికి వెళ్లి చూస్తే ఆ పరికరం కనిపించలేదు. గల్లంతైన ఆ పరికరం జీవిత కాలం వందేళ్ల వరకు ఉంటుందని అంచనా. అయితే దీనిపై అధికారికంగా వివరాలు లేవు. రాళ్ల కుప్ప పడిపోయిందా ? ఉత్తరాఖండ్‌లో నందాదేవి పర్వత శ్రేణుల్లోని రాళ్ల కుప్ప బలహీనపడి కుప్పకూలిపోవడంతో ఉత్తరాఖండ్ వరద బీభత్సంలో చిక్కుకొని ఉండవచ్చునని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జువాలజీ (డబ్ల్యూఐహెచ్‌జీ) అంచనా వేసింది. పర్వతంలోని రాళ్లు ఏళ్ల తరబడి మంచుతో కప్పబడి ఉండడంతో బాగా నాని బలహీనపడి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మంచు చరియలు విరిగిపడిన ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా సర్వే నిర్వహించిన శాస్త్రవేత్తలు రాళ్ల కుప్ప బలహీనపడడమే వరదలకు కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కలచంద్ సెయిన్ చెప్పారు. ఈ పర్వత ప్రాంతం అత్యంత లోతున ఏటవాలుగా ఉంటుందని అందువల్ల మంచు చరియలు కరిగి పడిపోగానే వరదలు పోటెత్తాయని తెలిపారు. చదవండి: (విలయం మిగిల్చిన విషాదం) -
విలయం మిగిల్చిన విషాదం
డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ జల విలయానికి సంబంధించి ఇప్పటివరకు 26 మృతదేహాలు లభించాయి. గల్లంతైన మరో 171 మంది ఆచూకీ కోసం సహాయ దళాలు కృషి చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకుపోయిన 30 మందిని సహాయ బృందాలు రక్షించాయి. మరోవైపు, ఈ విలయానికి కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. చమోలీ జిల్లా, జోషిమఠ్ దగ్గర్లోని నందాదేవి హిమనీనదం వద్ద అనూహ్యంగా భారీ ఎత్తున మంచు చరియలు విరిగిపడడంతో గంగానది ఉపనదులైన అలకనంద, రిషి గంగ, ధౌలీ గంగ నదులకు వరద పోటెత్తిందని, దాంతో ఈ జల ప్రళయం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నదీమార్గంలోని పర్వతం పై నుంచి లక్షలాది మెట్రిక్ టన్నుల మంచు ఒక్కసారిగా, వేగంగా కిందకు విరుచుకుపడడంతో ఈ జల ప్రళయం సంభవించి ఉంటుందని భావిస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సోమవారం తెలిపారు. అంతకుముందు, ఆయన ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. ఇస్రో శాస్త్రవేత్తలు తనకు చూపించిన చిత్రాల్లో.. వరద ఉధృతి ప్రారంభమైన చోట హిమనీనదం ఏదీ కనిపించలేదని, మంచు అంతా కిందకు జారిపడిపోయిన ఒక పర్వతం మాత్రం ఉందని తెలిపారు. ఆ పర్వత శిఖరంపై నుంచే పెద్ద ఎత్తున మంచు కిందకు జారిపడి ఉంటుందని, దాంతో ధౌలి గంగ, రిషి గంగ నదులకు మెరుపు వరదలు వచ్చాయని భావిస్తున్నామని వివరించారు. ఈ ఘటనకు ప్రత్యక్ష, పరోక్ష కారణాలను గుర్తించిన తరువాత, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తామని వివరించారు. అభివృద్ధి నిరోధక కధనాలకు అవకాశంగా ఈ దుర్ఘటనను తీసుకోవద్దని సూచించారు. వరద ప్రభావ ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించేలా రాష్ట్రంలో మౌలిక వసతులను బలోపేతం చేస్తామని సోమవారం తనను కలిసిన ఉత్తరాఖండ్ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. చదవండి: (తెలిసే వచ్చిన జలవిలయం ఇది) ముమ్మరంగా సహాయ చర్యలు వరదల్లో చిక్కుకుపోయి, ఇంకా ఆచూకీ లభించని సుమారు 170 మందిలో జల విద్యుత్కేంద్రంలో పనిచేస్తున్నవారు, నదీ తీరం వెంట ఇళ్లు కొట్టుకుపోవడంతో గల్లంతైన వారు ఉన్నారని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. 480 మెగావాట్ సామర్ధ్యమున్న, ఎన్టీపీసీకి చెందిన తపోవన్–విష్ణుగఢ్ విద్యుత్ కేంద్రం, 13.2 మెగావాట్ల సామర్ధ్యమున్న రిషి గంగ జల విద్యుత్ కేంద్రం తాజా వరదలతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. కచ్చితమైన సంఖ్య తెలియనప్పటికీ.. పదుల సంఖ్యలో కార్మికులు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సొరంగాల్లో చిక్కుకుపోయారు. దాదాపు 13 గ్రామాలకు చుట్టుపక్కల ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరద ప్రభావ ప్రాంతాల్లో ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టాయి. ఆర్మీ మెడికల్ కార్ప్స్, వైమానిక దళ బృందాలు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. చదవండి: (స్వయంకృతం) తపోవన్– విష్ణుగఢ్ విద్యుత్ కేంద్రం టన్నెల్లో చిక్కుకుపోయిన సుమారు 35 మందిని రక్షించేందుకు సహాయ బృందాలు కృషి చేస్తున్నాయి. పెద్ద ఎత్తున బుల్డోజర్లు, జేసీబీలు ఇతర యంత్ర సామగ్రిని అక్కడికి తరలించారు. 250 మీటర్ల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉన్న ఈ సొరంగ మార్గం కొద్దిగా వంపు తిరిగి ఉన్న కారణంగా సహాయ చర్యలకు సమయం పడుతోందని రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. సొరంగంలోపల పెద్ద ఎత్తున బురద పేరుకుపోయిందని, ఇప్పటివరకు సుమారు 100 మీటర్ల మేర బురదను తొలగించగలిగామని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్‌కుమార్ పాండే వెల్లడించారు. సుమారు 300 మంది ఐటీబీపీ సిబ్బంది ఈ విధుల్లోనే ఉన్నారన్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన అందరినీ రక్షించగలమనే ఆశిస్తున్నామన్నారు. అధికారులు అందజేసిన వివరాల ప్రకారం.. ఈ వరదల్లో విద్యుత్ కేంద్రాల సిబ్బందిలో 202 మంది గల్లంతయ్యారని, వారు ప్రధానంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల వారని పాండే వివరించారు. ఈ విద్యుత్ ప్రాజెక్టుల సూపర్వైజర్లు కూడా గల్లంతు కావడంతో ఉద్యోగులు/కార్మికులకు సంబంధించిన పూర్తి సమాచారం లభించడం లేదన్నారు. మరో చిన్న సొరంగంలో.. తపోవన్– విష్ణుగఢ్ కేంద్రానికి సంబంధించిన మరో చిన్న సొరంగంలో చిక్కుకుపోయిన 12 మందిని, రిషిగంగ కేంద్రం వద్ద వరదల్లో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించగలిగామని తెలిపారు. ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లకు చెందిన స్నిఫర్ డాగ్స్‌ను కూడా సహాయ చర్యల్లో పాలు పంచుకునేందుకు రంగంలోకి దింపారు. ఈ సొరంగానికి ఒకవైపే మార్గం ఉందని విద్యుత్ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. సోమవారం మరిన్ని బలగాలను జోషిమఠ్‌కు పంపించామని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. వరద ఉధృతికి మేటవేసిన బురదతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. పలు నిర్మాణాలు కొట్టుకుపోయి, బురదలో కూరుకుపోయాయి. కచ్చితమైన కారణమేంటి? ఈ దుర్ఘటనకు కచ్చితమైన కారణాన్ని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఇందుకోసం పలు బృందాలు ఇప్పటికే చమోలీ చేరుకున్నాయి. డీఆర్డీవోలోని ‘ద స్నో అండ్ అవలాంచీ స్టడీ ఎస్టాబ్లిష్మెంట్’సభ్యులు రంగంలోకి దిగారు. వాతావరణ మార్పు, లేదా ఆకస్మిక శీతాకాల వర్షాలు ఈ విలయానికి కారణం కావచ్చని నిపుణులంటున్నారు. హిమనీనద సరస్సు ఒక్కసారిగా ఉప్పొంగడం వల్ల కానీ, మంచు చరియలు విరిగి నదీ మార్గాన్ని అడ్డుకుని, ఆ తరువాత ఒక్కసారిగా ఆ మార్గం తెరుచుకోవడంతో కింది ప్రాంతాలకు విరుచుకుపడిన వరద వల్ల కానీ ఈ జల ప్రళయం చోటు చేసుకుని ఉండవచ్చని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. -
స్వయంకృతం
వర్షాకాలంలో హఠాత్తుగా కుంభవృష్టితో వరదలు ముంచెత్తిన సందర్భం కాదు. మండు వేసవిలో హిమఖండం కరిగి ఊరిపై విరుచుకుపడిన ఉదంతమూ కాదు. ఎలాంటి కీడూ శంకించని వణికించే చలికాలంలో ఉన్నట్టుండి ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్‌ను జల విలయం ముంచెత్తింది. దేవభూ మిగా పిలుచుకునే ఆ రాష్ట్రానికి తీరని విషాదం మిగిల్చింది. ఇంతవరకూ 26 మంది మృతులను లెక్కేయగా, దాదాపు 171 మంది జాడ తెలియలేదంటున్నారు. హఠాత్తుగా వచ్చిన వరదల్లో జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థ(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలోని తపోవన్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, రిషిగంగ హైడ్రో పవర్ ప్రాజెక్టు ధ్వంసం కాగా, మరికొన్ని డ్యామ్‌లు, రోడ్లు, బ్రిడ్జిలు, సొరంగం, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని చెబుతున్నారు. ఆచూకీ తెలియకుండాపోయినవారిలో అత్యధి కులు తపోవన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులేనని సమాచారం అందుతోంది. ఆ ప్రాజెక్టుకు చెందిన టన్నెల్ నుంచి 20మందిని కాపాడగలిగారు. ఉత్తరాఖండ్‌కు ఇది మొదటి విషాదం కాదు. ఎనిమిదేళ్లనాడు సైతం ఆ రాష్ట్రం ఇలాంటి విపత్తునే చవిచూసింది. ఎన్ని సాధించినా ప్రకృతి ముందు మనిషి పిపీలకం. దాని ఆగ్రహాన్ని చల్లార్చటం ఎవరి తరమూ కాదు. కావాలని ప్రకృతితో దోబూచులాడటానికి ప్రయత్నించి, పనిగట్టుకుని దాన్ని రెచ్చ గొడితే పర్యవసానాలు అసాధారణ రీతిలో వుంటాయి. ఇప్పుడు జరిగిందదే. అలక్‌నందా పరివాహ ప్రాంతంలో హిమనదీ సంబంధమైన సరస్సులు ఇరవై వరకూ వున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమఖండాలు కరగటం వల్ల ఏర్పడే జలాలు ఎక్కడికక్కడ ఇలా సరస్సులుగా ఏర్పడతాయి. వీటితో అత్యంత జాగురూకతతో మెలగాలని, అవి ఎప్పుడో అప్పుడు కట్టుదాటి నదీ ప్రవాహంలో కలిసి దిగువ ప్రాంతాల్లో తీరని నష్టం కలగజేసే ప్రమాదం వుందని కూడా హెచ్చరించారు. ఈ ముప్పును కనిష్ట స్థాయిలో వుంచేందుకు ప్రభుత్వపరంగా చేయాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యలేమిటో కూడా సూచించారు. కానీ పట్టించుకున్నవారెవరు? 2013లో పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ల సమీపంలో భారీ వర్షాలు పడటంతో గంగ, భాగీరథి, మందాకిని, అలక్‌నంద వంటి నదులన్నీ మహోగ్రరూపమెత్తి జనావాసాలపై విరుచుకుపడ్డాయి. వందలాదిమంది ప్రాణాలు తీశాయి. అప్పట్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకూ చెందినవారు కూడా తీర్థయాత్రలకెళ్లిఆ వరదల్లో చిక్కుకుని నరకయాతన చవిచూశారు. రోజుల తరబడి సాయం అందక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సహాయ బృందాలు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడానికి కూడా చాలా రోజులు శక్యం కాలేదు. కానీ దాన్నుంచి అక్కడి ప్రభుత్వం నేర్చుకున్నదేమిటి? తీసుకున్న చర్యలేమిటి? వాటి మాటెలావున్నా యధాప్రకారం అక్కడ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ముమ్మరం చేసేందుకు ప్రయత్నించింది. రాష్ట్రంలో అప్పటికే వంద లాది జల విద్యుత్ ప్రాజెక్టులున్నా పెండింగ్‌లోవున్న పది హైడ్రో పవర్ ప్రాజెక్టులకు అనుమతిని వ్వాలని మూడేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వాన్ని ఉత్తరాఖండ్ కోరింది. సాధారణ పరిస్థితుల్లో అయితే హిమఖండాలు నెమ్మదిగా కరుగుతూ హిమానీ నదాల్లోకి ఎప్పటి కప్పుడు నీరు చేరుతుంటుంది. అందునా శీతగాలులు బలంగా వీస్తున్న ప్రస్తుత సమయంలో అవి అంత త్వరగా కరగవు. పర్యావరణం దెబ్బతింటున్న వర్తమానంలో అటువంటి సహజసిద్ధమైన ప్రక్రియను ఊహించలేం. వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతుంటే, అడవులు తగలబడి దాన్ని మరింత పెంచుతుంటే ఆ హిమఖండాలు మోతాదుకు మించి కరగటం సర్వసాధారణం. అలాగే కుంభవృష్టి సైతం సరస్సు మట్టాలను పెంచి నదుల్లోకి భారీ వరద నీరు చేరుతుంది. ఇవి చాలవన్నట్టు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం డైనమైట్లతో కొండలను పిండి చేస్తుంటే, ఆ ప్రకంపనల ధాటికి హిమఖండాలు ఒక్కసారిగా విరిగిపడే ప్రమాదం వుంటుంది. 2013 విషాదం తర్వాత ఈ ప్రాంతంలో పరిశోధనలు చేసిన స్విస్ శాస్త్రవేత్తల బృందం హిమాలయ సానువుల్లో మొత్తం 251 హిమానీ నదాల సరస్సులున్నాయని తేల్చింది. వీటిల్లో 104 అత్యంత ప్రమాద కారులని, అలక్‌నంద సమీపంలో ఇవి 20 వరకూ వున్నాయని చెప్పారు. వీటివల్ల ముప్పు ఉన్నదని హెచ్చరించారు. ఇప్పుడు ఏ కారణం వల్ల ఈ దుర్ఘటన జరిగిందన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఉన్నట్టుండి ఒక పెద్ద పలక హిమఖండం నుంచి వేరుపడటంతో ఒక్కసారిగా సరస్సులోని జల మట్టం పెరిగి వరదలు పోటెత్తి వుండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే విషాద ఘటన జరిగిన ఆదివారంగానీ, అంతకుముందు రోజుగానీ ఆ ప్రాంతంలో వర్షాలు లేవు. ఉత్తరాఖండ్ ఉదంతం ప్రకృతి పట్ల మన అవగాహనను పెంచాలి. దానిపట్ల భయభక్తులతో వ్యవహరిస్తేనే... దాని సహనాన్ని పరీక్షించకుండా వున్నప్పుడే అది మనల్ని చల్లగా చూస్తుందన్న ఎరుక కలగాలి. హిమానీ నదాల్లో ప్రకృతిపరంగా జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు గ్రహించగలిగే సాంకేతికతను అభివృద్ధి చేయటం, హెచ్చరిక వ్యవస్థలను అమలులోకి తీసుకు రావటం, జలవిద్యుత్ ప్రాజెక్టుల సంఖ్యను బాగా కుదించటం, అన్ని రకాల అక్రమ నిర్మాణాలు ఆపటం వంటి చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ప్రమాదాలను నివారించగలుగుతాం. 2011లో స్వామి నిగమానంద గంగానదిని మాఫియాలనుంచి రక్షించాలని నాలుగు మాసాలపాటు ఆమరణ దీక్ష సాగించి ప్రాణాలు బలిపెట్టారు. కానీ ఆయన పరిత్యాగం నుంచి ఉత్తరాఖండ్ నేర్చుకున్నదేమీ లేదు. ఇప్పటికైనా పాలకులకు వివేకం కలగాలని ఆశిద్దాం. -
తెలిసే వచ్చిన జలవిలయం ఇది
జలసంబంధమైన విపత్తులు, విద్యుత్ ప్రాజెక్టుల మధ్య కార్యకారణ సంబంధం ఎలా ఉంటుంది అనేది ఆ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో స్పష్టపడక పోవచ్చు. కానీ ఈ రోజు రేని గ్రామస్తుల భయాందోళనలు కూడా భూతా పం, నిర్లక్ష్యపూరితమైన సివిల్ ఇంజనీరింగ్ గండంతో ముడిపడి ఉన్న విధ్వం సక చర్యలనుంచే పుట్టుకొచ్చి ఉండవచ్చు. 2019లో కోర్టుముందుకొచ్చిన పిటిషన్ రిషి గంగా ప్రాజెక్టుపై గురిపెట్టినప్పటికీ ఇతర ప్రాజెక్టులన్నీ ప్రజల వ్యతి రేకతకు గురయ్యాయి. నిజానికి భారత ప్రభుత్వం ఈ మొత్తం ప్రాంతాన్ని ఎలాంటి పర్యావరణ విలువను పట్టించుకోని వనరుల కేంద్రంగా మార్చివేసింది. అయితే ఇప్పుడు ఇదే పెద్ద భ్రమ అయి కూర్చుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలిలోని రేని గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు 2019లో ఆ రాష్ట్ర హైకోర్టులో ఒక ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. 2005లో తమ గ్రామానికి సమీపంలో నెలకొల్పిన రిషి గంగా విద్యుత్ ప్రాజెక్ట్ నిర్వాహకులు పర్యావరణ హితం కాని పద్ధతులు పాటిస్తున్నారని, దీనివల్ల రిషి గంగానదికి, ఆ ప్రాంతంలోని జంతుజాలానికి, రేని గ్రామ వాసుల నివసించే హక్కుకు, వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రమాదం పొంచి ఉన్నదని ఆయన న్యాయస్థానానికి విన్నవించారు. 1970లలో జరిగిన చారిత్రాత్మక చిప్కో ఉద్యమ కీలక ప్రాంతాల్లో రేని ఒకటి. ఉత్తరాఖండ్ హైకోర్టు వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేయడమే కాకుండా పిటిషన్ దాఖలైన మూడు వారాల్లోపు సమాధానం పంపాలని కోరింది. సిగరెట్ తాగడం, ఊపిరి తిత్తుల కేన్సర్ హెచ్చరిక రెండింటికీ మధ్య సాధారణ లింక్ ఏమిటనేది వాటి ప్రభావానికి గురయ్యేంతవరకు మనకు స్పష్టంగా కనిపించదు, బోధపడదు కూడా. అదేవిధంగా జలసంబంధమైన విపత్తులు, విద్యుత్ ప్రాజెక్టుల మధ్య కార్యకారణ సంబంధం ఎలా ఉంటుంది అనేది ఆ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో స్పష్టపడక పోవచ్చు. కానీ ఈరోజు, రేని గ్రామస్తుల భయాందోళనలు.. భూతాపం, నిర్లక్ష్యపూరితమైన సివిల్ ఇంజనీరింగ్ గండంతో ముడిపడి ఉన్న విధ్వంసక చర్యలనుంచే పుట్టుకొచ్చి ఉండవచ్చు. ఫిబ్రవరి 7 ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో అతి విధ్వంసకరమైన వరద ప్రవాహం పొంగి పొర్లింది. అతి ఇరుకుగా ఉన్న నదీ లోయల గుండా భీకరంగా తన్నుకొచ్చిన భారీ జలప్రవాహాన్ని చిత్రీకరించిన కెమెరా షాట్లు దాని విధ్వంసకర నమూనాను మిగిల్చిపోయాయి. 2013లో రుద్రప్రయాగ్ ప్రాంతంలోని కేదార్‌నాథ్‌ను చుట్టుముట్టిన మెరుపు వరదలు కలిగించిన విధ్వంసం తర్వాత తొమ్మిదేళ్లకు చమోలీలో జలవిలయం సంభవించింది. నిపుణులు, అధికారులు ఆనాటి విపత్తుకు కారణాలను కాస్త ఊహించగలిగారు. ఇప్పుడు చమోలీలో జరిగిన ఘటన కూడా కేదార్నాథ్ ఘటనకు కొనసాగింపుగానే ఉంటుందని ప్రత్యేకించి ప్రాణనష్టం, మానవుల బాధలు, నివాసాల విధ్వంసం, ఆర్థిక దుష్పరిణామాలు వంటివి ఈ రెండు ఘటనల్లో సమానంగా వర్తిస్తాయని ముందస్తు వార్తలు చెబుతున్నాయి. పశ్చిమ హిమాలయాల్లో అవక్షేపన మార్పు 2013లో వచ్చిన మెరుపు వరదలకు, రోజులపాటు కురిసిన కుండపోత వర్షం, హిమనీనదం వల్ల ఏర్పడిన డ్యామ్ తెగిపోవడమే కారణమైంది. ఆ ఉత్పాతంలో 5 వేలకు పైగా జనం కొట్టుకుపోయారు. ఈ ప్రాంతంలో ఇలాంటి విషాదాలు సంభవిస్తాయని అద్భుతమైన ప్రదర్శనలతో పరిశోధకులు ముందస్తుగానే హెచ్చ రించారు కూడా. అయితే కుంభవృష్టి కారణంగా చమోలీ ఘటన జరగనప్పటికీ అది కూడా చివరకు మెరుపు వరద కారణంగానే సంభవించింది. నందాదేవి వద్ద మంచు కొండ చరియలు జోషిమట్ వద్ద అకాలంలో విరిగిపడటంతో ఆ వరద పొంగు మొత్తంగా రిషి గంగానదిలోగి కొట్టుకొచ్చింది. దీంతో రిషి గంగా నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగిపోయింది. ఈసారి చమోలీలో జరిగిన విషాదానికి రిషి గంగా నది పొడువునా నిర్మించిన వివిధ స్థాయిల్లోని జలవిద్యుత్ ప్రాజెక్టులే కారణమయ్యాయి. అలకనందా ఎగువన నిర్మించిన రిషి గంగా విద్యుత్ ప్రాజెక్టు (13.2 మెగావాట్లు) ఈ హిమపాతం తాకిడికి మొట్టమొదటగా గురయింది. వరద తాకిడికి కొట్టుకుపోయిన ప్లాంట్‌కి చెందిన శిథిలాలు కిందికి వచ్చేసి ఇతర యూనిట్లను దెబ్బతీశాయి. అక్కడ పనిచేస్తున్న వారి ప్రాణాలను హరించాయి. ఇవి కాకుండా ప్రభుత్వ నిర్వహణలోని తపోవన్ (520 మెగావాట్లు), పిపాల్ కోటి (4ణ111 మెగావాట్లు) ప్రాజెక్టులు, ప్రైవేట్ సంస్థ విష్ణుప్రయాగ్ (400 మెగావాట్లు) ప్రాజెక్టు కూడా ఇక్కడే ఉన్నాయి. 2019లో కోర్టు ముందుకొచ్చిన పిటిషన్ రిషి గంగా ప్రాజెక్టుపై గురిపెట్టినప్పటికీ ఇతర ప్రాజెక్టులన్నీ ప్రజల వ్యతిరేకతకు గురయ్యాయి. నిజానికి భారత ప్రభుత్వం ఈ మొత్తం ప్రాంతాన్ని ఎలాంటి పర్యావరణ విలువను పట్టించుకోని వనరుల కేంద్రంగా మార్చివేసింది. తక్కువ కర్బన ఇంధనానికి వనరుగా మాత్రమే ఈ ప్రాంతాన్ని కేంద్రం పరిగణించింది. అయితే ఇదే పెద్ద భ్రమ అయి కూర్చుంది. చమోలీ వరద అనేది శీతాకాలం చివరలో ఆకస్మికంగా సంభవించిన హిమనీనదం విరిగి పడి కిందకు ప్రవహించిన దాని ఫలితం. చదవండి: (ఉత్తరాఖండ్‌లో జల విలయం) 2018లోనే బెంగళూరుకు చెందిన దివేచా సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ సంస్థ ఈ ప్రాంతం పరిస్థితిపై ఇచ్చిన వివరణాత్మక నివేదికను ఎవరూ తోసిపుచ్చలేరు. ఆ నివేదిక ప్రకారం 1991 నుంచి వాయవ్య హిమాలయాల్లోని సగటు ఉష్ణోగ్రత 0.66 సెల్సియస్ డిగ్రీలకు పెరుగుతూ వచ్చింది. ఇది అంతర్జాతీయ ఉష్ణోగ్రత పెరుగుదల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. చంఢీగర్‌లోని స్నో అండ్ అవలాంచె స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి చెందిన శాస్త్రజ్ఞులు చెప్పిన దానిప్రకారం గత 25 సంవత్సరాల్లో వాయవ్య హిమాలయాల్లో శీతకాలాలు మరింతగా వెచ్చబడుతూ వచ్చాయని తెలుస్తోంది. సహస్రాబ్దాల పాటు అతిశీతల చలికాలాలకు మారుపేరుగా నిలిచిన ఈ ప్రాంతం ఇప్పటికే పూర్తిగా దాని వ్యతి రేక దిశను ప్రదర్శించడం ప్రారంభించేసింది. విపత్తునుంచి పుట్టుకొచ్చే మరో సమస్య ఏదంటే మన మేనేజ్మెంట్ వ్యూహాలు ఎంత సమర్థంగా ఉంటాయన్నదే. 2013లో సంభవించిన కేదార్నాథ్ విపత్తు... రాడార్ ఆధారిత టెక్నాలజీలతో సహా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పర్చుకోవడానికి మేలుకొలుపు అయింది. రిషి గంగా నీటి స్థాయిలను నిజ సమయంలో పర్యవేక్షించడానికి రాడార్ ఆధారిత పరికరాన్ని కేంద్ర జల కమిషన్ ఉపయోగించిందని, కేంద్రం కూడా సహకరించిందని తెలుస్తోంది. అయితే స్థానిక అధికారులు ఈ ఉపకరణాన్ని స్థానిక కార్యకలాపాలకు ఏమేరకు ఉపయోగిస్తున్నారన్నది స్పష్టం కాలేదు. ఏదేమైనా మన కళ్లముందు వాస్తవ చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పాత కామిక్‌లో కొన్ని పదాలు గుర్తుకొస్తున్నాయి. మనం శత్రువును చూశాం... అదెవరో కాదు మనమే! సీపీ రాజేంద్రన్ వ్యాసకర్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ప్రొఫెసర్ -
అస్తిపంజరాలు లభించిన మాట నిజమే
డెహ్రాడూన్: మూడేళ్ల క్రితం ప్రకృతి విపత్తుతో విలవిలలాడిన కేదార్నాథ్ ఆలయం వద్ద అనేక అస్తిపంజరాలు లభించిన మాట నిజమేనంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ ఈ విషయమై సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘మొత్తం 31 అస్తిపంజరాలు దొరికాయి. అందులో 21 అస్తిపంజరాలకు అంత్యక్రియలు నిర్వహించాం. మిగతా ఎనిమిది మృతదేహాలకు మంగళవారం చేస్తాం’ అని చెప్పారు. దీనితో నాకేమీ సంబంధం లేదు. నాకు ముందు అధికారంలో ఉన్న విజయ్ బహుగుణ గాలింపు చర్యలను నిలిపివేశారు. గాలింపు చర్యలు చేపట్టలేదంటూ ఇల్లెక్కి అరిచేవాళ్లంతా ఈ విషయమై ఆయననే నిలదీయాలి’ అని అన్నారు. కేదార్నాథ్ ఆలయం సమీపంలో అనేక అస్తిపంజరాలు లభ్యమయ్యాయంటూ వార్తలు రావడం తెలిసిందే. 2013లో ఏకబిగిన కుండపోతగా వర్షం కురియడంతో అనేక భవనాలు కూలిపోయి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో కొంతమంది తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం కొండ పైభాగానికి వెళ్లారు. అయితే అక్కడ ఆహారం, నీరు దొరకకపోవడంతో చనిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. -
మాంగల్య బలం
రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లా భికంపుర గ్రామానికి చెందిన విజేంద్ర ఒక ట్రావెల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జూన్ 12, 2013లో భార్య లీలతో పాటు, 30 మంది ప్రయాణికులతో తాను చేసే ట్రావెల్ కంపెనీ బస్సులో చార్ధామ్ యాత్రకు వెళ్లాడు. కానీ, దురదృష్టం మృత్యువరదైంది. చెల్లిని కోల్పోయిన అన్న, కొడుకును కోల్పోయిన తండ్రి, తండ్రి చావు చూసిన కొడుకు... గుండె చెరువయ్యేంత విషాదం. ఈ వరదల్లో విజయేంద్ర కూడా తన భార్య లీలను కోల్పోయాడు. ఆమె కోసం వెదకని చోటు లేదు. కలవని అధికారి లేడు. మొక్కని కాలు లేదు. ఎక్కడా ఆమె జాడలేదు. వారాలు గడిచాయి. నెలలు గడిచాయి. ఏడాదిన్నర అయింది. బంధువులందరూ ఆశ వదులుకున్నారు. ఆమె చనిపోయిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి, 9 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇచ్చింది. కానీ విజేంద్రకు ఎక్కడో ఒక నమ్మకం. తన భార్య ఎక్కడో ఒక చోట బతికే ఉందని. దేవుడి దయ తన మీద ఉందని. అందుకే... ఏ రోజు అయితే తన భార్య కనిపించకుండా పోయిందో, ఆరోజు నుంచి ఉత్తరాఖండ్‌ను విడిచివెళ్లలేదు అతను. చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా భార్యను వెదుక్కుంటూ వేలాది గ్రామాలకు వెళ్లాడు. కనిపించిన వారికల్లా ఆమె ఫోటోను చూపించాడు. 2015 జనవరి 27. చివరికి ఎవరో చెప్పారు. ‘‘గోంగోలి అనే ఊళ్లో ఒక అమ్మాయి మతిస్థిమితం లేకుండా తిరుగుతోంది. నీ దగ్గర ఉన్న ఫొటోలో ఉన్న అమ్మాయిలాగే ఉంది’’ అని చెప్పారు. పరుగుపరుగున ఆ ఊరికెళ్లాడు విజేంద్ర. అదృష్టం ఏమిటంటే ఆమె అతడి భార్యే! దురదృష్టమేమిటంటే... లీలా ఇప్పుడు మాట్లాడడం లేదు. ఎవరినీ గుర్తు పట్టడం లేదు కూడా. అయితే ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందట. ఆమె తిరిగి మామూలు మనిషయ్యే రోజు కోసం, జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసుకునే రోజు కోసం ఇంటిల్లిపాది ఆశగా ఎదురుచూస్తోంది. -
కేథార్‌నాథ్‌లో తొలి పూజలు
-
వైఎస్ఆర్ సీపీ రూ. 20 లక్షల సాయం
-
ఉత్తరాఖండ్ వరద భాదితులపై బతుకుచిత్రం
-
ఉత్తరాఖండ్ కోలుకునేదెన్నడు?
-
ఆర్మీని కూడా వదలని బాబు
-
ఎందుకీ ప్రళయం
-
మృతులు 10,000 మందికి పైగా ఉన్నారు: ఉత్తరాఖండ్ స్పీకర్
-
క్షణం ఆలస్యానికే మింగేసిన వరద
-
వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ నేతల పరామర్శ
-
బద్రీనాథ్‌లో సాక్షి టీవీ బృందం
-
డెహ్రడూన్ లో వైఎస్సాఆర్ సీపీ సేవలు
-
కేదార్‌నాథ్‌లో మృతదేహాల ఖననానికి వానతో ఆటంకం