
సాక్షి,అమరావతి: ఉత్తరాఖండ్ వరదలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో వరద బాధితులను ప్రభుత్వం త్వరగా ఆదుకోవాలి. బాధితులకు వెంటనే పునరావాసం కల్పించటంతోపాటు, తగిన సహాయ చర్యలను చేపట్టాలి’అని కోరారు.
Deeply shocked by the devastating floods in Uttarakhand.
My thoughts and prayers are with the victims and their families during this incredibly difficult time.
I hope the government will take swift and effective relief measures to support those affected and ensure their safety…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 6, 2025
వరద విలయం కరాళ నృత్యం
దేవభూమి ఉత్తరాఖండ్‌ను బురద వరద అతలాకుతలం చేసింది. ఆధ్యాత్మిక ధామాలను దర్శించే పర్యాటకులతో ప్రకృతి సోయగాలతో అలరారే రమణీయమైన హిమాలయ గ్రామం ‘ధరాలీ’పై వరద విలయం కరాళ నృత్యం చేసింది. క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన బురద వరద ఆ గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలను భూస్థాపితం చేసింది.

అప్పటిదాకా ప్రకృతి అందాలతో తులతూగిన ఉత్తరాఖండ్‌లోని ఆ గ్రామం ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. ఎగువ ప్రాంతాల వరద నీరు, బురద ముంచెత్తండతో ఆ ప్రాంతంలో రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయి.