వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు | New Appointments In Ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు

Aug 5 2025 9:34 PM | Updated on Aug 5 2025 9:41 PM

New Appointments In Ysrcp

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మహిళా విభాగంలో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం జరిగింది. ఐదు జోన్లకు ఐదుగురు మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్లను పార్టీ నియమించింది.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఈర్లి అనురాధ.. కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు వంగా గీత.. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఉప్పాల హారిక.. ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కాకాణి పూజిత.. వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఎస్.వి.విజయమనోహరి నియమితులయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement