ఓటమి బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

ఓటమి బడ్జెట్‌

Feb 15 2026 7:32 AM | Updated on Feb 15 2026 7:32 AM

ఓటమి

ఓటమి బడ్జెట్‌

ఓటమి బడ్జెట్‌ ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 మండిపడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు 12వ పీఆర్సీ ప్రకటిస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశే

ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు శూన్యం

న్యూస్‌రీల్‌

నిమ్మకాయల ధరలు

పులిచింతల ప్రాజెక్టు సమాచారం

గుంటూరు

టీడీపీ మేనిఫెస్టోకు తిలోదకాలు

విద్యారంగానికి కోతలు

12వ పీఆర్సీపై నిరాశే

భవిష్యత్‌ కార్యాచరణకు

సిద్ధమని ప్రకటన

వ్యవసాయ రంగానికి

అంతంత మాత్రమే

గుంటూరు ఎడ్యుకేషన్‌/ లక్ష్మీపురం (గుంటూరువెస్ట్‌): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ శనివారం శాసనసభలో ప్రవేశ పెట్టిన 2026–2027 బడ్జెట్‌పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఊహాజనిత బడ్జెట్‌ అని, టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు గ్యారెంటీ లేదని, ప్రాధాన్యత రంగాలకు తిలోదకాలు ఇచ్చారని మేథావులు, ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరించారని, 12వ పీఆర్సీపై నిరాశ మిగిల్చారని ఉపాధ్యాయ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత బడ్జెట్‌తో పోల్చితే విద్యారంగానికి కేటాయింపులు పెంచలేదని, తద్వారా విద్యారంగం ప్రమాదంలో పడనుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులను విస్మరించిన ప్రభుత్వ తీరుపై రాబోవు రోజుల్లో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయా సంఘాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా రైతాంగానికి కనీస కేటాయింపులు కూడా చేయకపోవడం ద్వారా ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరిని బయటపెట్టిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించే విధంగా 12వ పీఆర్సీ ప్రకటిస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. ఆర్థిక బకాయిలు, డీఏ బకాయిల చెల్లింపు కోసం నిధులు కేటాయించకపోవడం శోచనీయం. విద్యారంగానికి అరకొరగా కేటాయింపులు జరిపారు. పెండింగ్‌, డీఏ బకాయిల చెల్లింపు డిమాండ్‌తో ఈనెల 25న చలో విజయవాడకు తరలివెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.

– వై.శ్యాంబాబు,

ఎస్టీయూ, జిల్లా ప్రధాన కార్యదర్శి

I

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు శూన్యం. వ్యవసాయానికి తగిన కేటాయింపులు, గిట్టుబాటు ధరలు లేని పరిస్థితుల్లో ధరల స్థిరీకరణనిధికి కేవలం రూ.500కోట్లు కేటాయించడం శోచనీయం. సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు రూ.9,906 కోట్లకు పరిమితం కావడం అభివృద్ధి నిరోధకంగా ఉంది. జాబ్‌ కేలండర్‌, ఉద్యోగాల భర్తీపై ప్రస్తావన లేకపోవడంతోపాటు పాఠశాల విద్యకు రూ.32,308 కోట్ల కేటాయింపులు గతంతో పోల్చితే పెంపుదల లేదు. విశ్వవిద్యాలయాలను అభివృద్ధి పర్చేందుకు ఎటువంటి చర్యలు ప్రతిపాదించకపోవడం ఉన్నత విద్యాభివృద్ధికి విఘాతం.

– కేఎస్‌ లక్ష్మణరావు,

మాజీ ఎమ్మెల్సీ

తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6000, గరిష్ట ధర రూ.6800, మోడల్‌ ధర రూ.6400 వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 4900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ 35.8640 టీఎంసీలు.

ఓటమి బడ్జెట్‌ 1
1/7

ఓటమి బడ్జెట్‌

ఓటమి బడ్జెట్‌ 2
2/7

ఓటమి బడ్జెట్‌

ఓటమి బడ్జెట్‌ 3
3/7

ఓటమి బడ్జెట్‌

ఓటమి బడ్జెట్‌ 4
4/7

ఓటమి బడ్జెట్‌

ఓటమి బడ్జెట్‌ 5
5/7

ఓటమి బడ్జెట్‌

ఓటమి బడ్జెట్‌ 6
6/7

ఓటమి బడ్జెట్‌

ఓటమి బడ్జెట్‌ 7
7/7

ఓటమి బడ్జెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement