శివరాత్రికి ముస్తాబైన క్వారీ దేవాలయం | - | Sakshi
Sakshi News home page

శివరాత్రికి ముస్తాబైన క్వారీ దేవాలయం

Feb 15 2026 7:32 AM | Updated on Feb 15 2026 7:32 AM

శివరా

శివరాత్రికి ముస్తాబైన క్వారీ దేవాలయం

శివరాత్రికి ముస్తాబైన క్వారీ దేవాలయం

చేబ్రోలు: మహాశివరాత్రి ఉత్సవాలకు వడ్లమూడి గ్రామంలోని క్వారీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానం సర్వాంగ సుందరంగా తయారైంది. గత రెండేళ్లుగా భక్తులు అధిక సంఖ్యలో తరలిస్తున్నారు. ఈ ఏడాది కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తరువాత ఖ్యాతిగాంచిన క్వారీ తిరునాళ్లకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్ష మంది వరకు భక్తులు హాజరవుతారు. చేబ్రోలు మండలం నారాకోడూరు నుంచి మూడు భారీ విద్యుత్‌ ప్రభలు, గుండవరం, గొడవర్రు గ్రామాల నుంచి మూడు భారీ విద్యుత్‌ ప్రభలు, చేబ్రోలు, వడ్లమూడి, శేకూరు, శలపాడు, సుద్దపల్లి గ్రామాల నుంచి భారీ విద్యుత్‌ ప్రభలు పండుగ రోజు ఆలయానికి వస్తాయి. వీటితో పాటు వందల సంఖ్యలో బాల, చిన్న చిన్న ప్రభలు తరలివస్తాయి. పొంగళ్లు పొంగించి స్వామి మొక్కులు తీర్చుకోవటం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.

క్వారీ బాలకోటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

● మహాశివరాత్రి పండుగ సందర్భంగా క్వారీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానానికి రెండు రోజులుగా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శనివారం జిల్లా నలుమూలల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పొంగళ్లు పొంగించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చక బృందం ఆధ్వర్యంలో బాలకోటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి వారికి రుద్రాభిషేకం, పూలంగి సేవ, బిళ్వార్చన, రుద్రాక్షాలంకారం, మహాశివరాత్రి పండుగ రోజున లింగోద్భవ కాలంలో ఏకాదశి రుద్రాభిషేకాలు, ప్రత్యేక అలంకారం తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ఆలయ ప్రాంగణం వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తుది మెరుగులు దిద్దుకుంటున్న

భారీ విద్యుత్‌ ప్రభలు

● మహాశివరాత్రి పండుగ రోజున క్వారీ దేవాలయానికి వచ్చే భారీ విద్యుత్‌ ప్రభలు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. వంద అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న చేబ్రోలు, నారాకోడూరు తదితర గ్రామాల్లోని భారీ విద్యుత్‌ ప్రభలు నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. చేబ్రోలు గ్రామ ప్రభ ఆలయం ప్రాంగణం వద్ద ఆకర్షణీయంగా రూపుదిద్దుకొంది.

గత అనుభవాలను పరిగణనలోకి

తీసుకోని అధికారులు

● వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి తిరునాళ్లకు అన్ని శాఖల అధికారులు గతంలో జరిగిన లోటుపాట్లను గుర్తించి జరగబోయే క్వారీ తిరునాళ్ల పండుగ రోజు ఏర్పాట్లను సమీక్షించుకోవలసి ఉంది. భద్రత ఏర్పాట్లు గురించి, ట్రాఫిక్‌, ఆలయ ప్రాంగణం వద్ద రద్దీ, భారీ విద్యుత్‌ ప్రభల రాకపోకలు తదితర అంశాలపై గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తగిన ప్రణాళికలతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉంది.

వీఐపీ దర్శనాలు, పాసుల పంపిణీపై విమర్శలు

● క్వారీ తిరునాళ్ల సందర్భంగా ఆలయం వద్ద వీఐపీ దర్శనాల పేరుతో ప్రత్యేక దర్శనానికి వెళ్లేవారికి దేవదాయ, రెవెన్యూ, పోలీసు శాఖలు ఇస్తున్న అనుమతులపై ప్రతి ఏటా విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది కూడా వీఐపీ పాసుల పంపిణీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్య భక్తులు, దర్శన టిక్కెట్టు తీసుకొన్న భక్తులను గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. ఆలయం వద్ద కీలకంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నేతల కనుసన్నల్లో తమకు అనుకూలమైన వారికి వీఐపీ పాసులు విచ్చలవిడిగా పంపిణీ చేస్తుండటంపై పలు విమర్శలు వస్తున్నాయి.

షాపుల కేటాయింపులో పచ్చ పాతం

● క్వారీ తిరునాళ్ల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో వ్యాపారం చేసుకొనే వారికి షాపుల కేటాయింపులో పచ్చపాతం వహించటంపై చిరు వ్యాపారులు విమర్శిస్తున్నారు. గతంలో అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా తమకు అనుకూలమైన వారికి, ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వటంపై పలు ఆరోపణలు వస్తున్నాయి.

● పంచాయతీ, దేవదాయశాఖలకు ఆదాయ వనరులుగా ఉన్న వాటికి ముందుగా వేలం పాటల ప్రకటనలను వ్యాపారులకు, మీడియా ద్వారా తెలియపరిచేవారు. ఈ ఏడాది మాత్రం భిన్నంగా తమకు అనుకూలమైనవారికి మాత్రమే సమచారం ఇచ్చి కేటాయింపులు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి.

తుది మెరుగులు దిద్దుకుంటున్న

భారీ విద్యుత్‌ ప్రభలు

శివరాత్రికి ముస్తాబైన క్వారీ దేవాలయం 1
1/1

శివరాత్రికి ముస్తాబైన క్వారీ దేవాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement