అత్తతో గొడవపడి వెళ్లిపోయిన కోడలు | married woman missing in Vikarabad | Sakshi
Sakshi News home page

అత్తతో గొడవపడి వెళ్లిపోయిన కోడలు

Apr 19 2025 12:34 PM | Updated on Apr 19 2025 12:34 PM

married woman missing in Vikarabad

వికారాబాద్: ఇంట్లో అత్త తో గొడవ పడిన కోడలు ఎటో వెళ్లిపోయిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంగెం గ్రామానికి చెందిన కూడళ్ల బాలమణికి నలుగురు సంతానం. అందులో రెండో కూతురు స్పందనను ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన బట్టు సురేష్‌ కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. భార్యాభర్తలు వేములనర్వ గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యులుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం అత్తాకోడళ్లు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన స్పందన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం భర్త సురేష్‌ వెతకగా లభ్యం కాలేదు. దీంతో స్పందన తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ తెలిపారు.   

ట్రాన్స్‌జెండర్లపై కేసు నమోదు 
మీర్‌పేట: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ట్రాన్స్‌జెండర్స్‌పై మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు కథనం ప్రకారం.. స్టేషన్‌ పరిధిలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో కొందరు ట్రాన్స్‌జెండర్లు రాత్రివేళల్లో అసభ్యకర దుస్తులు ధరించి వికృత చేష్టలు చేయడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడు తూ అసౌకర్యం కలిగిస్తున్నారన్న సమాచారం రావడంతో మీర్‌పేట పోలీసులు గురువారం రాత్రి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. మందమల్లమ్మ చౌరస్తా, ఆర్‌సీఐ రహదారిపై 7 మంది ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.   

Advertisement
 
Advertisement
Advertisement