సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. కాగా లైంగిక ఆరోపణల కేసులో పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత రేగా కాంతారావు అరెస్టయ్యారు.పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పంజాగుట్ట పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసింది.
తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశారనిరియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో తన వద్ద నుండి డబ్బులు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రేగా కాంతారావుపై పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేశారు. అయితే తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయన కేసును విచారించిన ధర్మాసనం ఈ కేసును కొట్టివేసింది.


