అమెరికాలో రోడ్డు ప్రమాదం.. | Telangana Woman Dies in Road Accident in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో రోడ్డు ప్రమాదం..

Oct 5 2026 5:40 AM | Updated on Oct 5 2026 5:40 AM

Telangana Woman Dies in Road Accident in US

మరిపెడకు చెందిన వివాహిత మృతి 

ఖమ్మం రూరల్‌/మరిపెడ: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి సింహాద్రినగర్‌ నివాసి దారం సుప్రియ (30) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన దారం శ్రీనివాస్, జ్యోతి దంపతులు కుటుంబంతో కలిసి సింహ్రాద్రినగర్‌లో నివాసముంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సుప్రియకు మహబూబాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రంజిత్‌తో వివాహం జరిగింది. వీరు అమెరికాలోని ముస్సోరి రాష్ట్రంలో నివాసం ఉంటుండగా, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.

సుప్రియ శనివారం తన స్నేహితురాలితో కలిసి కారులో రెస్టారెంట్‌కు వెళ్లి వస్తుండగా ఎదురుగా వచి్చన టిప్పర్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుప్రియ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె స్నేహితురాలు తీవ్రంగా గాయపడింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు ఆమె మృతి వార్త తెలియడంతో తండ్రి శ్రీనివాస్, కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, సుప్రియ కుటుంబ సభ్యులను సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌ తదితరులు పరామర్శించారు. సుప్రియ మృతదేహం అమెరికా నుంచి మంగళవారం వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement