
వైఎస్‌ఆర్ కడప జిల్లా: పట్టణంలోని కొత్తకొట్టాలు ప్రాంతానికి చెందిన కేతనగరి వెన్నెల అనే వివాహిత రెండు రోజులుగా కనిపించడం లేదని తమకు ఫిర్యాదు అందినట్లు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన తల్లి ఇంటికి రాలేదని, చుట్టుపక్కల వెతికినా కనిపించలేదని ఆమె ఆచూకీ తెలపాలని కోరుతూ వెన్నెల కుమారుడు వెంకటరమణ మంగళవారం ఫిర్యాదు చేసిట్లు సీఐ వివరించారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ తెలిసిన వారు 9121100618 (మైదుకూరు సీఐ), 9121100619 (ఎస్‌ఐ) నంబర్లకు తెలియజేయాలని కోరారు. కాగా తాను ఆత్మహత్యకు పాల్పడుతూ ఓ మహిళ స్వయంగా తీసిన ఓ వీడియో మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో కనిపించింది. దీనిపై వివాహిత తీసిన వీడియో లొకేషన్ కోసం గాలిస్తున్నామని, వీడియోలో ఉన్న వివాహిత, అదృశ్యమైన వెన్నెల అనే వివాహిత ఒకరేనా కాదా అన్నది తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
విద్యార్థి..
కొండాపురం: మండల పరిధిలోని దత్తాపురం గ్రామానికి చెందిన జి. రామ్‌చరణ్ కనిపించడం లేదని తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ ఆర్,శివనాగిరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు దత్తాపురం గ్రామానికి చెందిన జి.జ్యోతి, చిన్నపెద్దులయ్య దంపతుల పెద్ద కొడుకు రామ్‌చరణ్ తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంటర్ చదువుతున్నాడు. చదువుకోమని మందలించడంతో ఇంటిలో నుంచి సోమవారం మధ్యాహ్నం తాడిపత్రికి బస్సులో వెళ్లిపోయాడు. తిరిగి రాకపోవడంతో తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.