వెజ్‌ బిర్యానీలో చికెన్‌ ముక్కలు | Bengaluru Airport Restaurant Controversy, Customer Finds Chicken Pieces In Veg Biryani And Raises Complaint | Sakshi
Sakshi News home page

వెజ్‌ బిర్యానీలో చికెన్‌ ముక్కలు

Nov 1 2026 11:51 AM | Updated on Nov 1 2026 12:37 PM

Chicken pieces In Veg Biryani

దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో రెస్టారెంట్లు, క్యాంటీన్ల గురించి తరచూ ఆరోపణలు వస్తుంటాయి. తాజాగా ఓ రెస్టారెంట్‌లో వెజ్‌ బిర్యానీ ఆర్డర్‌ చేయగా అందులో చికెన్‌ ముక్కలు వచ్చాయి. దీంతో సదరు కస్టమర్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీయూష్‌ అగర్వాల్‌ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా రెస్టారెంట్‌లో వెజ్‌ బిర్యానీ ఆర్డర్‌ చేసి ఆరగిస్తుండగా చికెన్‌ పీసులు రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఈ హోటల్‌పై ఆహార భద్రతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement