మమతా- దీప్కే భేటీ.. సీజేపీ కీలక ప్రకటన! | CJP Founder Abhijeet Dipke Meets Mamata | Sakshi
Sakshi News home page

మమతా- దీప్కే భేటీ.. సీజేపీ కీలక ప్రకటన!

Nov 1 2026 10:29 AM | Updated on Nov 1 2026 10:29 AM

CJP Founder Abhijeet Dipke Meets Mamata

న్యూఢిల్లీ: ఢిల్లీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. యువత చేపట్టిన ఉద్యమాలకు మద్దతు తెలిపినందుకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ఓట్ల చోరీ ఆరోపణలపై ఇండియా కూటమి చేపట్టనున్న ర్యాలీకి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అయితే ఈ ర్యాలీలో సీజేపీ నేరుగా పాల్గొనబోదని స్పష్టం చేశారు.

నీట్ పేపర్ లీకేజీ అంశంపై జంతర్ మంతర్ వద్ద తమ పార్టీ తొలిసారిగా చేపట్టిన నిరసనకు మమతా బెనర్జీ మద్దతు తెలిపారని దిప్కే గుర్తుచేశారు. తమ పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సమయంలోనూ ఆమె అండగా నిలిచారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమెను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు వెల్లడించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా పోరాడే ప్రతి సంస్థకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

మరోవైపు దిప్కే, యువ కార్యకర్తల ప్రయత్నాలను మమతా బెనర్జీ ప్రశంసించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌), ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో యువత కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఆదివారం జరిగే ర్యాలీకి సీజేపీ పూర్తి మద్దతు ప్రకటించిందని, తాము కూడా ఆ సంస్థకు అండగా ఉంటామని చెప్పారు. అంతేకాకుండా దిప్కే, ఇతర కార్యకర్తలు పశ్చిమ బెంగాల్‌కు వచ్చి కార్యక్రమాలు నిర్వహించాలని ఆహ్వానించారు.

ఇదీ చదవండి: నేటి నుంచి కొత్త రూల్స్‌.. రాజధాని ప్రజలకు ఇక కష్టాలే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement