రాజధానిలో టెన్షన్‌.. టెన్షన్‌.. అంతటా పోలీస్‌ పహరా! | India Bloc Rally Ramlila maidan Rahul Gandhi Gyanesh | Sakshi
Sakshi News home page

రాజధానిలో టెన్షన్‌.. టెన్షన్‌.. అంతటా పోలీస్‌ పహరా!

Nov 1 2026 7:04 AM | Updated on Nov 1 2026 7:46 AM

India Bloc Rally Ramlila maidan Rahul Gandhi Gyanesh

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నేడు (ఆదివారం) ఇండియా కూటమి నిర్వహిస్తున్న భారీ ర్యాలీకి పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. రామలీలా మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు హాజరుకానున్నారు.

ర్యాలీ కనాట్ ప్లేస్ నుంచి ప్రారంభమై మింటో రోడ్ జంక్షన్, అజ్మేరీ గేట్ మీదుగా రామలీలా మైదానానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీస్ కమిషనర్ సహా ఉన్నతాధికారులు స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
 

4 వేల మందికి పైగా సిబ్బంది మోహరింపు
ర్యాలీ మార్గం, సభా ప్రాంగణంలో 4 వేల మందికి పైగా పోలీసు, కేంద్ర సాయుధ బలగాలను మోహరించనున్నారు. రామలీలా మైదానాన్ని 14 భద్రతా జోన్లుగా విభజించారు. ప్రతి జోన్‌ను అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. 200కు పైగా సీసీ కెమెరాలు, డ్రోన్లు, బాడీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మైదానంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఐటీవో, ఢిల్లీ గేట్, రాజ్‌ఘాట్, అజ్మేరీ గేట్, తుర్క్‌మాన్ గేట్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను మళ్లించనున్నారు. బహదూర్ షా జఫర్ మార్గ్, జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్, మింటో రోడ్, దేశ్‌బంధు గుప్తా రోడ్‌లలో ప్రయాణించవద్దని పోలీసులు సూచించారు.

ఎల్‌ఎన్‌జేపీ, జీబీ పంత్ ఆసుపత్రులకు వెళ్లే అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు ముందుగానే ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.

రామలీలా మైదానంలో సభకు మాత్రమే అనుమతి ఇచ్చామని, మింటో రోడ్-కనాట్ ప్లేస్ కూడలి నుంచి ప్రతిపాదించిన ర్యాలీకి ఎలాంటి దరఖాస్తు అందలేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఇండియా కూటమికి ఢిల్లీ పోలీసుల షాక్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement